85 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో..?

సెంట‌ర్ ఫ‌ర్ పోలార్ అండ్ ఓషియ‌న్ రిసెర్చ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 85 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ సైంటిస్ట్‌, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్‌, ఆఫీస‌ర్ ఇతర ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత‌ప‌రీక్ష […]

Written By: Navya, Updated On : June 19, 2021 4:40 pm
Follow us on

సెంట‌ర్ ఫ‌ర్ పోలార్ అండ్ ఓషియ‌న్ రిసెర్చ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 85 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ సైంటిస్ట్‌, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్‌, ఆఫీస‌ర్ ఇతర ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

రాత‌ప‌రీక్ష లేకుండా ఇంట‌ర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వాళ్లు గోవాలో పని చేయాల్సి ఉంటుంది. https://ncpor.res.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏ సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవచ్చు.

మొత్తం 85 ఉద్యోగ ఖాళీలలో ప్రాజెక్ట్ సైంటిస్ట్‌- i 42 ఉద్యోగ ఖాళీలు, ప్రాజెక్ట్ సైంటిస్ట్‌- ii ఉద్యోగ ఖాళీలు 21, ప్రాజెక్ట్ అసిస్టెంట్ – iii ఉద్యోగ ఖాళీలు 3, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ 4, ఆఫీసర్ 5, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 10 ఉన్నాయి. పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలు ఉండగా మెరెయిన్ సైన్స్‌, మైక్రోబ‌యాల‌జీలో బీఈ లేదా బీటెక్ చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ద‌ర‌ఖాస్తుల ఆధారంగా ఎంపిక‌చేసిన అభ్య‌ర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. జులై 15వ తేదీ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.