Telangana Unemployed: తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం యువత ఎదురు చూస్తోంది. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయోనని ఆశగా ఉన్నారు.

సీఎం కేసీఆర్ ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉన్నామని చెబుతున్నా ఆచరణలో కనిపించడం లేదని పెదవి విరుస్తున్నారు. దీంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఉద్యోగుల సర్దుబాటు, ఉద్యోగుల విభజన తదితర కార్యక్రమాలు పూర్తయ్యాక నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ అధికారంలోకి రాకముందే ఇంటికో ఉద్యోగం అనే వాగ్దానం చేసి అధికారంలోకొచ్చాక దాని గురించి మరిచిపోయారు. దీంతో నిరుద్యోగులు పలుమార్లు గుర్తు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత ఆశలు పెంచుకున్నారు. కానీ ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల అయితేనే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు అందరు కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ నిరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో దాదాపు 60 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు చెబుతున్నారు. అన్నింటికి నోటిఫికేషన్లు విడుదల చేస్తే నిరుద్యోగుల ఆశలు ఫలించినట్లే. కానీ ప్రభుత్వం ఎప్పుడు వాటిని విడుదల చేస్తుందో చూడాలి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం జనవరిలో నోటిఫికేషన్లు విడుల చేస్తామని చెబుతున్నా కేసీఆర్ ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదు. దీంతో ఉద్యోగాల కల్పన అందని ద్రాక్షేనా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
Also Read: KCR vs BJP: కేసీఆర్ కు చెక్ పెట్టే బీజేపీ వ్యూహం: కీలక నేతలను ఢిల్లీకి పిలిచిన అమిత్ షా
ఉద్యోగ ఖాళీల్లో దాదాపు 40 వేల వరకు పోలీస్, టీచర్ ఉద్యోగాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తే ఉద్యోగాలు సాధించి తమ ఆశలు నెరవేర్చుకోవాలని చూస్తున్నారు. కానీ ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేస్తుందో తెలియడం లేదు. సీఎం కేసీఆర్ ఏ మేరకు నిరుద్యోగుల ఆశలు నెరవేరుస్తారో వేచి చూడాల్సిందే.
Also Read: Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్న నోరు మూతపడ్డట్టేనా?