Telangana: మద్యం విక్రయాల్లో తెలంగాణ ఎప్పుడు ముందుంటూనే ఉంటోంది. మందుబాబుల జేబులు మాత్రం గుళ్ల అవుతూనే ఉన్నాయి. మద్యం వినియోగంలో తెలంగాణ దూకుడు ప్రదర్శిస్తూనే ఉంటుంది. దీంతో ఒక్క అక్టోబర్ మాసంలోనే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరగడం విశేసం. ఈ అక్టోబర్ లో రూ.2653.07 కోట్ల మద్యం అమ్ముడు కావడం తెలిసిందే. గత అక్టోబర్ లో రూ.2623 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది మాత్రం రూ.30 కోట్ల మేర అమ్మకాలు పెరగడం గమనార్హం.

గతేడాది కంటే ఈ ఏడాది బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 2020 అక్టోబర్ లో 26.93 లక్షల బీరు కేసులు అమ్ముడు కాగా ఈ ఏఢాది అక్టోబర్ మాసంలో 31.43 లక్షల కేసులు అమ్ముడుకావడంతో మద్యం ప్రియుల మద్యం దాహం అర్థమైపోతోంది. దీంతో మద్యం అమ్మకాల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. మద్యం విక్రయాల్లో ప్రతి సంవత్సరానికి ప్రగతి కనిపిస్తోంది. దీంతో లక్షల ఆదాయం ఎక్సైజ్ శాఖకు చేరుతోంది.
మరోవైపు హుజురాబాద్ ఉప ఎన్నికలో మద్యం ఏరులై పారడంతో మద్యం అమ్మకాల్లో భారీ పెరుగుదల నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి కోట్ల మేర ఆదాయం సమకూరడం తెలిసిందే. దసరా పండుగ కూడా రావడంతో మద్యం అమ్మకాల్లో పెరుగుదల కనిపించింది. దీంతో రూ.4 కోట్ల మేర ఆదాయం సమకూరింది.
Also Read: TRS: టీఆర్‌ఎస్‌కు అప్పుడే ‘ఈటల’ సెగ
దేశంలో మద్యం వినియోగిస్తున్న స్టేట్లలో టాప్ – 5 స్టేట్లలో తెలంగాణకు కూడా స్థానం దక్కడం తెలిసిందే. దీంతో మద్యం కిక్కుతో ప్రజలు పండగ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుగా మద్యం గుర్తింపు పొందడం చూస్తున్నాం. దీంతో ఎక్సైజ్ శాఖకు ఆదాయం బ్రహ్మాండంగా వస్తున్నట్లు సమాచారం.
Also Read: TRS: కేసీఆర్ కొరివితో తలగొక్కున్నాడా? ఇది టీఆర్ఎస్ పతనానికి దారితీస్తుందా?