https://oktelugu.com/

తెలంగాణ గ్రామీణం అతలాకుతలం..!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ మొదట్లో నెమ్మదించినా ఆ తరువాత విజృంభించింది. ప్రారంభంలో కరీంనగర్‌లో ఒకేసారి 11 కేసులు నమోదవడంతో ఆ తరువాత ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో హైదరాబాద్‌ మినహా ఎక్కడా కేసులు నమోదు కాలేదు. కానీ ఆ తరువాత మెల్లిగా పట్టణాలకు ఆ తరువాత పల్లెలకు కరోనా వైరస్‌ పాకింది. ప్రస్తుతం పట్టణాల కంటే పల్లెల్లోకే ఎక్కువగా కేసులు నమోదవుతుండడంతో ఆందోళన వాతావరణం నెలకొంది. Also Read: ఎంసెట్‌ ఆప్షన్ల నమోదులో అందుకే ఆలస్యం […]

Written By:
  • NARESH
  • , Updated On : October 12, 2020 / 01:27 PM IST
    Follow us on

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ మొదట్లో నెమ్మదించినా ఆ తరువాత విజృంభించింది. ప్రారంభంలో కరీంనగర్‌లో ఒకేసారి 11 కేసులు నమోదవడంతో ఆ తరువాత ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో హైదరాబాద్‌ మినహా ఎక్కడా కేసులు నమోదు కాలేదు. కానీ ఆ తరువాత మెల్లిగా పట్టణాలకు ఆ తరువాత పల్లెలకు కరోనా వైరస్‌ పాకింది. ప్రస్తుతం పట్టణాల కంటే పల్లెల్లోకే ఎక్కువగా కేసులు నమోదవుతుండడంతో ఆందోళన వాతావరణం నెలకొంది.

    Also Read: ఎంసెట్‌ ఆప్షన్ల నమోదులో అందుకే ఆలస్యం

    రాష్ట్ర ఆరోగ్యశాఖ ఇటీవల తెలిపిన కరోనా కేసుల సంఖ్యలో మొత్తంగా పల్లెల్లోనే ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 12,751 గ్రామాలుండగా వీటిలో దాదాపు 10 వేలకు పైగా పల్లెల్లో కరోనా వైరస్‌ సోకిందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో 6.1 శాతం పాజిటివ్‌ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. అత్యధికంగా రంగారెడ్డి జిల్ల్లాల్లో 7.2 శాతం ఉండగా అత్యల్పంగా నారాయణపేటలో 3.4 శాతంగా ఉన్నట్లు తెలిపింది.

    రోజువారీ కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నా అందులో ఎక్కువగా గ్రామల్లోనే నమోదవుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రతి 10 లక్షల జనాభాకు 66,750 చొప్పున పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రుల్లో కరోనా బాధితులు తగ్గుతున్నా మరణాల రేటు మాత్రం తగ్గడం లేదు. అంతేకాకుండా ఎక్కువ శాతం ఐసీయూల్లోనే ఉండడం గమనార్హం. ఐసీయూలో చేరిన వారిలో జూలైలో15.14 శాతం ఉండగా సెప్టెంబర్‌లో 17.82 శాతం ఉన్నారు.

    Also Read: మొక్కజొన్న సాగు వద్దంటున్న ప్రభుత్వం.. అసలు మతలబేంటి?

    మరోవైపు రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నా కోలుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం 2,13,084 కరోనా కేసులు ఉండగా 1,87,342 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 25,514 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 20,036 మంది ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ఎక్కువ శాతం యాక్టివ్‌ కేసులో హోం ఐసోలేషన్‌లో ఉండడంతో ఆసుపత్రుల్లో కోవిడ్‌ రోగుల తాకిడి తక్కువైంది.