YS Vijayamma- YSRTP: వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ రాజీనామా చేశారు. ఈ మేరకు వైసీపీ ప్లీనరీలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. విజయమ్మ రాజీనామాతో వైసీపీకి నష్టమే అని తెలిసినా ఆమె రాజీనామా చేయకుండా ఆపలేకపోయారు. దీంతో రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం అంత సులువు కాదనే విషయం తెలిసిందే. విజయమ్మ తన కూతురు కోసం వైసీపీకి రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. తెలంగాణలో షర్మిల వైఎస్సార్ టీపీ స్థాపించి అధికారమే లక్ష్యంగా పాదయాత్ర చేపడుతోంది.

వైఎస్సార్ ఆంధ్రతోపాటు తెలంగాణలో కూడా తన హవా కొనసాగించారు. దీంతో ఆయనకు ఇప్పటికి కూడా అభిమానులున్నారు. వారందరిని తమ పార్టీలో చేర్చుకోవాలని షర్మిల ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా వైఎస్ అభిమానులు తమ పార్టీ వారేనని చెబుతూ వారిని కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ అభిమానులు ఎటు వైపు వెళతారనేది ప్రశ్నగానే మిగులుతోంది.
Also Read: TRS Dissident Leaders: ‘కారు’లో కట్టప్పలు.. మరో మహారాష్ట్రగా తెలంగాణ అవుతుందా?
దీంతో వైఎస్ అభిమానులను తమ పార్టీలో కలుపుకోవాలని విజయమ్మ కూడా ప్రణాళికలు రచిస్తున్నారు. విజయమ్మ తెలంగాణలో పర్యటించి వైఎస్ అభిమానులను వైఎస్సార్ టీపీలో కలిపేందుకు తన శక్తియుక్తులను ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. గతంలో జగన్ కోసం కూడా విజయమ్మ, షర్మిల పాదయాత్ర చేసి ఆయన విజయానికి కారకులయ్యారు. ఈ క్రమంలో షర్మిల వెంట నిలిచి వైఎస్సార్ టీపీని విజయపథంలో నడిపించేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ టీపీ గౌరవ అధ్యక్షురాలుగా సేవలందించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో షర్మిలకు తోడుగా నిలిచి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకే విజయమ్మ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. కొడుకుకు ఆంధ్రలో అధికారముండగా తెలంగాణలో కూడా బిడ్డకు అధికారం కట్టబెట్టేందుకు విజయమ్మ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది అందుకే షర్మిల పార్టీని అధికారంలో నిలబెట్టేందుకు తన శాయిశక్తులా కృషి చేయాలని విజయమ్మ భావిస్తోంది. ఇందుకోసమే వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ టీపీ లో చేరి కూతురును అందలం ఎక్కించాలని ఆశిస్తోంది. సో విజయమ్మ కోరిక ఏ మేరకు తీరుతుందో వేచి చూడాల్సిందే.
Also Read:BJP Focus On KCR: కేసీఆర్‌పై ‘బదిలీ’ అస్త్రం.. బీజేపీ సరికొత్త వ్యూహం!
[…] […]