Homeజాతీయ వార్తలుBJP Target On KCR: టార్గెట్ కేసీఆర్ బీజేపీ నాయకుల లక్ష్యం ఇదేనా?

BJP Target On KCR: టార్గెట్ కేసీఆర్ బీజేపీ నాయకుల లక్ష్యం ఇదేనా?

BJP Target On KCR: రాష్ట్రంలో ఎన్నికలకు మరో ఏడాది ఉంది. కానీ ఇప్పటికే వాతావరణం వేడెక్కింది. విమర్శలు, ప్రతి విమర్శలు, పోటాపోటీగా కటౌట్లు, పార్టీ కార్యాలయాల ఎదుట కొత్త తరహాలో “సాలు దొర.. బై బై మోదీ” వంటి ప్రచారాలు.. వెరసి టీఆర్ఎస్, బీజేపీ నాయకులు హోరాహోరీగా పోరాడుతున్నారు. ఇక జూలై 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జరగటం, పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే సమావేశానికి ప్రధానమంత్రి మోదీ హాజరుకానుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పది లక్షల ఆహ్వాన పత్రికలను సిద్ధం చేశారు.16 రైళ్లు, పెద్ద మొత్తంలో బస్సులను ఇందుకు సిద్ధం చేసుకున్నారు. మిగతా ఏర్పాట్లను 40 మంది దాకా బీజేపీ నాయకులు పర్యవేక్షిస్తున్నారు.

BJP Target On KCR
KCR, MODI

రెట్టించిన ఉత్సాహంతో..

నాలుగు ఎంపీలు,హుజురాబాద్, దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీకి చుక్కలు చూపించింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే పార్టీ రాష్ట్ర అధిష్టానం బండి సంజయ్ ని అధ్యక్షుడిగా నియమించింది. సంజయ్ అధ్యక్షుడిగా నియమితులైన దగ్గరనుంచి పార్టీ కార్యకలాపాలు ఉదృతం చేశారు. నిరుద్యోగ దీక్ష, చలో ప్రగతి భవన్, ప్రజా సంగ్రామ యాత్ర ఒకటి, రెండు దశలు విజయవంతంగా పూర్తి చేశారు. క్షేత్రస్థాయిలో కూడా పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఖమ్మం బీజేపీ కార్యకర్త సాయి గణేష్ కుటుంబానికి అండగా నిలిచారు. మతోన్మాదానికి బలైన నాగరాజు కుటుంబానికి భరోసా ఇచ్చారు. దీంతో బీజేపీకి క్షేత్రస్థాయిలో మైలేజ్ అంతకంతకు పెరుగుతోంది. దీన్ని ఇంటెలిజెన్స్ ద్వారా గుర్తించిన కేసీఆర్ కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా పలు కార్యక్రమాలు రూపొందించారు. దీనికి ప్రతిగా బీజేపీ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇక సమావేశాలలో ప్రధాని మోదీ నుంచి బండి సంజయ్ దాకా కేసీఆర్ నే లక్ష్యంగా చేసుకొని మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read: Fadnavis as The CM Of Maharashtra: మహా’ సీఎంగా రేపు ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం..?

కేసీఆరే ఎందుకు?

దేశంలో 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కు తెలంగాణను ఎంచుకుంది. ఇందుకు కారణం లేకపోలేదు. గత రెండేళ్ల నుంచి బీజేపీ కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. సందు దొరికితే మోదీ నుంచి సంజయ్ దాకా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. స్వతహాగానే తనకు ఎదురు తిరిగే స్వభావం ఉన్న వాళ్లు అంటే నచ్చని మోడీ.. ఈసారి కేసీఆర్ సంగతి తేల్చేందుకు నేరుగా రంగంలోకి దిగారు. ప్రతీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మెలిపెడుతూ వస్తున్నారు. ప్రధాన ఆర్థిక వనరు అయిన మై హోమ్ జూపల్లి రామేశ్వరరావు ను దూరం చేశారు. చిన జీయర్ స్వామితో స్నేహబంధాన్ని కట్ చేశారు. అదే కాకుండా కేంద్రం నుంచి వచ్చే వివిధ పనులకు సంబంధించిన నిధులు, అభివృద్ధి పథకాలు, ఆర్బీఐ రుణాలు, ఎఫ్సీఐ ధాన్యం మిల్లింగ్ వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులను కేంద్రం బహిరంగంగానే ఎండగట్టింది. కేంద్రం మమ్మల్ని ఇబ్బంది పెడుతోందని రాష్ట్ర ప్రభుత్వం గగ్గోలు పెట్టినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఇది అంతకంతకు పెరుగుతుండడంతో బీజేపీ, టీఆర్ఎస్ ఉప్పు నిప్పులా మారాయి. ఇక ఇటీవల రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు మద్దతు తెలిపింది. మొదట్లో కాంగ్రెస్ బూచి చూపి వెనుకడుగు వేసిన టీఆర్ఎస్.. తటస్థంగా ఉంటే బీజేపీకి లాభం చేకూర్చుతుందని భావించి యశ్వంత్ సిన్హా కు జై కొట్టింది.

BJP Target On KCR
KCR, modi

పథకాల్లో అవకతవకలను ఎండ కట్టే ప్రయత్నం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెబుతున్న మిషన్ భగీరథ ఇంకా పూర్తి కాలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేవలం 17,000 మాత్రమే పూర్తి చేసింది. ఇక మిషన్ కాకతీయకు రెండేళ్లలోనే మంగళం పాడింది. రైతుబంధు లబ్ధిదారులను అంతకంతకు పెంచుకుంటూ పోతుంది. రైతుబంధులోనూ కొర్రీలు పెడుతోంది. టీ హబ్ లోను కేటీఆర్ అనుయాయులకే లబ్ధి జరుగుతోంది. రైతు వేదిక, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్ ల వంటి నిర్మాణాలు ఉపాధి పథకం ద్వారా చేపట్టినా.. రాష్ట్రం ఏమాత్రం కేంద్రం పేరు చెప్పడం లేదు. మరోవైపు మన ఊరు మన బడి పథకాన్ని కూడా ఓ బడా కంపెనీకి కట్టబెట్టడంతో బీజేపీ నాయకులు వీటన్నిటికీ సంబంధించి పూర్తి వివరాలు సేకరించారు. కేసీఆర్ పదేపదే గొప్పగా చెప్పే సంక్షేమ పథకాల్లో అవినీతిని ఎండగట్టాలని నిర్ణయించారు. కేసీఆర్ నే టార్గెట్ చేసుకొని ఈ సభ నిర్వహిస్తుండటంతో అధికార పక్షం ఏం చేస్తుందోననే ఆసక్తి సర్వత్రా ఉంది.

Also Read:Udaipur Murder : ఉదయ్ పూర్ నిందితులను ఇలా పట్టుకున్నారు.. వైరల్ వీడియో లీక్

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular