Jagapathi Babu: జగపతి బాబు.. సినిమా ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పుడు తెలుగు ఫ్యామిలీ హీరో, ఇప్పుడు మాత్రం దక్షిణాది విలన్ గా, సపోర్టింగ్ క్యారెక్టర్ గా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతానికి స్టార్ హీరోల సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్న బిజీ నటుల్లో జగపతి బాబు ముందు వరుసలో ఉంటారు.

ఈ మధ్య కాలంలో జగపతి బాబు కనబరిచిన నటనను ఎవ్వరూ మర్చిపోలేరు. అంతలా ఆయన చెరగని ముద్ర వేశారు. అయితే ఇప్పుడు జగపతి బాబు గురించి ఓ వార్త ఫిల్మ్ సర్కిల్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే జగపతి బాబు నటనకు గుడ్బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాల పై ఆసక్తి తగ్గిందని.. అందుకే, జగపతి బాబు ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
Also Read: Meena Husband kill Pigeons: పావురాలే మీనా భర్త ప్రాణాలు తీసిందా..? బయటపడ్డ షాకింగ్ నిజం
ఐతే, జగపతి బాబు నిర్మాణం చేపట్టాలని ప్లాన్ చేస్తున్నారట. నటుడిగా సినిమాలు తగ్గించి.. నిర్మాతగా ఎక్కువ సినిమాలు చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. కాకపోతే.. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు వస్తే మాత్రం.. తాను ఎపుడైనా నటిస్తాను’ అంటూ ఆయన మేకర్స్ కి క్లారిటీ ఇస్తున్నారు. మొత్తానికి జగపతి బాబు నటుడిగా సగం రిటైర్మెంట్ ప్రకటించినట్లే. ప్రస్తుతానికి ఒప్పుకున్న చిత్రాలను త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారు ఆయన. ఒక్కటి మాత్రం నిజం జగపతి బాబు పడి లేచిన కెరటం.

జగపతి బాబు హీరోగా బాగానే సంపాదించారు. అయితే, ఆయన సహచరులని నమ్మి, వారికి ఉదారంగా డబ్బులు ఇచ్చి కొంత నష్టపోయారు. దానికి తోడు సరైన ఆర్థిక క్రమశిక్షణ లేక డబ్బులు అన్ని పోగొట్టుకుని ఆస్తులు అముకున్నారు. ఓ దశలో చాలా కష్టాలు పడ్డారు. పైగా తానూ పడిన కష్టాలు గురించి తానే బాహాటంగా బయటకు చెప్పారు.
ఆ ఆర్థిక కష్టాలలో చివరికి తన తండ్రి బంగారు మొలతాడు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. అయినా ఆయన ఏ నాడు బాధ పడలేదు. చాలా ఓపెన్ గా ఉంటారు. ఎందుకు ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నారు అని ఎవరైనా అడిగితే, మన సమాజం చాలా కృత్రిమంగా మారిపోయింది, కాబట్టి ఎవరో ఒకరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి కదా’ అంటూ తనదైన శైలిలోనే జగపతిబాబు చెబుతారు. దటీజ్ జగపతి బాబు.