రేవంత్ ఏం చేస్తాడు? ఎలా చేస్తాడు?

ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్న‌డూ లేని ప‌రిస్థితిని తెలంగాణ కాంగ్రెస్ లో ఇక‌పై చూడ‌బోతున్నాం. పీసీసీ అధ్య‌క్షుడు అంటే.. కాంగ్రెస్ త‌ర‌పున‌ కాబోయే ముఖ్య‌మంత్రి అని న‌మ్ముతారు. పార్టీ ప‌రంగా చూసుకున్న‌ప్పుడు సీఎం హోదాగా భావిస్తారు. అందుకే.. ఆ కిరీటాన్ని నెత్తిన పెట్టుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతుంటారు చాలా మంది నేత‌లు. కోరిక అందరికీ ఉండొచ్చు. కానీ.. కావాల్సింది స‌మ‌ర్థ‌త. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ కు ఇది అనివార్య‌త కూడా. అందుకే.. సీనియారిటి, విధేయ‌త వంటి అంశాల‌ను ప‌క్క‌న పెట్టి, స‌మ‌ర్థ‌తనే […]

Written By: Bhaskar, Updated On : June 27, 2021 10:25 am
Follow us on

ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్న‌డూ లేని ప‌రిస్థితిని తెలంగాణ కాంగ్రెస్ లో ఇక‌పై చూడ‌బోతున్నాం. పీసీసీ అధ్య‌క్షుడు అంటే.. కాంగ్రెస్ త‌ర‌పున‌ కాబోయే ముఖ్య‌మంత్రి అని న‌మ్ముతారు. పార్టీ ప‌రంగా చూసుకున్న‌ప్పుడు సీఎం హోదాగా భావిస్తారు. అందుకే.. ఆ కిరీటాన్ని నెత్తిన పెట్టుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతుంటారు చాలా మంది నేత‌లు. కోరిక అందరికీ ఉండొచ్చు. కానీ.. కావాల్సింది స‌మ‌ర్థ‌త. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కాంగ్రెస్ కు ఇది అనివార్య‌త కూడా. అందుకే.. సీనియారిటి, విధేయ‌త వంటి అంశాల‌ను ప‌క్క‌న పెట్టి, స‌మ‌ర్థ‌తనే అంద‌లం ఎక్కించింది అధిష్టానం. మ‌రి, రాబోయే రోజులు ఎలా ఉంటాయ‌న్న‌దే ఇప్పుడు ఆస‌క్తిక‌రం.

త‌మ‌ను కాద‌ని రేవంత్ రెడ్డికి అవ‌కాశం ఇవ్వ‌డాన్ని కాంగ్రెస్ సీనియ‌ర్ల‌లో దాదాపుగా ఎవ్వ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నార‌నేది వాస్త‌వం. దీన్ని అడ్డుకునేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేయ‌గ‌ల‌రో.. అన్నీ చేశారు. ద‌శాబ్దాలుగా పార్టీని ప‌ట్టుకు వేళాడుతున్న త‌మ‌ను కాద‌ని, వేరే పార్టీలో నుంచి వ‌చ్చిన రేవంత్ కు ఎలా ఇస్తార‌ని ర‌గిలిపోయారు. సీనియ‌ర్ల‌లోనే ఒక‌రికి ఇవ్వాలి త‌ప్ప‌, రేవంత్ కు ఇస్తే అంగీక‌రించేది లేనే లేద‌ని చెప్పివ‌చ్చారు.

అయితే.. సీనియారిటీ పాచిక పార‌ట్లేద‌ని భావించి.. విధేయ‌త‌ను ముందుకు తెచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల‌కు విధేయులుగా ఉన్న‌వారికే పీఠం ఇవ్వాల‌నే డిమాండ్ ముందుకు తెచ్చారు. ఈ మేర‌కు భ‌ద్రాచ‌లం ఎమ్మెల్యే పొదెం వీర‌య్య లెటర్ హెడ్ మీద లేఖ కూడా రాశార‌ట‌. ఇందులో త‌మ ఆక్రోశం అంతా వెల్లగ‌క్కారు. ఈ విధంగా అవ‌కాశం ఉన్న అస్త్రాల‌న్నీ వాడేశారు.

కానీ.. పార్టీ ప‌రిస్థితి వేరుగా ఉంది. కేంద్రంలో, రాష్ట్రంలో రెండు సార్లు అధికారానికి దూర‌మైంది. ఈ గ్యాప్ లో అవ‌కాశం ఉన్న నేత‌లంతా ఇత‌ర పార్టీల్లోకి జంప్ అయిపోయారు. మ‌రోసారి కూడా అధికారం చేజారిపోతే.. పార్టీ పుట్టి మునిగిన‌ట్టేన‌నే భ‌యం అటు అధిష్టానంతోపాటు కేడ‌ర్ లో కూడా ఉంది. అందుకే.. కేసీఆర్ ను ఢీకొట్టే స‌త్తా ఉన్న నేత‌గా రేవంతే స‌రైన‌వాడు అని భావించి.. బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

అయితే.. రేవంత్ కు పీసీసీ ఇస్తే.. తాము స‌హ‌క‌రించేది లేద‌ని ప‌లువురు సీనియ‌ర్లు ఇండైరెక్టుగా చెప్ప‌నే చెప్పారు. మ‌రికొంద‌రైతే పార్టీ నుంచి వెళ్లిపోతామ‌ని కూడా లీకులు ఇచ్చారు. అధిష్టానం మాత్రం మీరేమైనా చేసుకోండి.. పార్టీని బ‌తికించుకోవ‌డ‌మే ముఖ్య‌మ‌ని తేల్చి చెప్పింది. మ‌రి, భ‌విష్య‌త్ ఎలా ఉండ‌బోతోంది అన్న‌ది అస‌లు పాయింటు. రేవంత్ ప‌గ్గాలనైతే సాధించాడు. మ‌రి, ర‌థాన్ని ఎలా ముందుకు న‌డిపిస్తాడ‌న్న‌దే ఆస‌క్తిక‌రం. అధిష్టానం ఆశించిన‌ట్టు ముందుకు సాగితే మాత్రం.. పార్టీ బాగుప‌డ‌డంతో, ఆయ‌న భ‌విష్య‌త్ సైతం బ్ర‌హ్మాండంగా ఉంటుంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. మ‌రి, ఏం చేస్తాడు? ఎలా చేస్తాడు? అన్న‌దే చూడాలి.