ప్రతీ కుటుంబానికి రూ.5వేల సాయమందించాలి: విపక్షాలు

రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ తో అఖిలపక్షం నేతలు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజాగా నెలకొన్న తాజాగా పరిస్థితులపై చర్చించి ప్రభుత్వానికి పలు సూచనలు, సలహాలిచ్చారు. సారూ…లాక్ డౌన్ […]

Written By: Neelambaram, Updated On : April 30, 2020 2:53 pm
Follow us on


రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ తో అఖిలపక్షం నేతలు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజాగా నెలకొన్న తాజాగా పరిస్థితులపై చర్చించి ప్రభుత్వానికి పలు సూచనలు, సలహాలిచ్చారు.

సారూ…లాక్ డౌన్ సొమ్ము లూటీ అయింది?

తెలంగాణలో ప్రభుత్వం కరోనా సాయం కింద పేదలకు అందిస్తున్న రూ.1,500లు సరిపోవని దానిని 5వేలకు పెంచాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. తరుగు పేరుతో రైతులను మార్కెటింగ్ అధికారులు మోసం చేస్తున్నారని ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొనుగోలు చేసిన వెంటనే ధాన్యానికి రైతులకు డబ్బులు చెల్లించాలని ఆయన సీఎస్ ను కోరారు. టీటీడీపీ అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉన్న తెలంగాణ వారిని రాష్ట్రానికి తీసుకు రావాలన్నారు. కరోనాపై ప్రభుత్వం పెట్టిన ఖర్చుకు లెక్కలు చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతప్రతం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసు సంఖ్యపై విపక్ష నేతలు అనుమానం వ్యక్తం చేశారు. ఏపీలో ఇప్పటివరకు 80వేలకు పైగా కరోనా వైరస్ పరీక్షలు చేస్తే తెలంగాణలో మాత్రం 20వేలకు మించి పరీక్షలు చేయకుండా కరోనా తగ్గుతుందని ప్రచారం చేస్తున్నారి మండిపడ్డారు. కరోనా కేసుల్లో కేంద్రం చెప్పే లెక్కలకు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలకు పొంతన కుదరడం లేదని ఆరోపించారు. కరోనాతో మృతి చెందినవారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.