దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతం కావడానికి ప్రధాన కారకుడిగా భావిస్తున్న తబ్లీగ్ జమాత్ చీఫ్ మౌలానా సాద్ పట్ల ఢిల్లీ పోలీసులు మెతక వైఖరి అవలంభించడం పలువురికి విస్మయం కలిగిస్తున్నది. ఢిల్లీ పోలీసులు నేరుగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆధీనంలో ఉండడంతో సాద్ అరెస్ట్ కు కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్నదా అనే అనుమానం కలుగుతున్నది.
అప్పటికే దేశం కరోనా వైరస్ పట్ల ఆందోళనకరంగా ఉన్న సమయంలో భారీ సంఖ్యలో విదేశాల నుండి కూడా పాల్గొన్న తబ్లీఘి జమాత్ సదస్సు ఢిల్లీలో జరుగుతున్నా పట్టించుకోని కేంద్ర హోమ్ శాఖ ఇప్పుడు అందుకు సంబంధించిన కేసు విషయంలో సహితం తప్పటడుగులు వేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తున్నది.
సాద్ కు ప్రభుత్వ యంత్రంగంతో పాటు ముస్లిం దేశాలలో ఉన్న పలుకుబడి కారణంగా కేంద్రం ఈ విషయంలో జంకుతున్నదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
కేవలం విచారణకు హాజరు కమ్మనమని నోటీసులు ఇచ్చి ఉరుకొంటున్నారు. ఈ రోజు వరుసగా నాలుగోసారి అటువంటి నోటీసు జరీ చేశారు.
మౌలానా సాద్ ప్రభుత్వ లాబోరేటరీకి వచ్చి కరోనా పరీక్ష చేయించుకోవడంతోపాటు దర్యాప్తునకు హాజరు కావాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు గతంలో మూడు నోటీసులు జారీ చేశారు. అయితే ఢిల్లీ పోలీసుల నోటీసులను అతను ఖాతరు చేయడం లేదు. కరోనా పరీక్ష చేయించుకునేందుకు ప్రభుత్వ లాబోరేటరీకి రాకపోగా, పోలీసుల దర్యాప్తునకు హాజరుకావడం లేదు.
కరోనా రహిత జిల్లాలను ప్రకటించిన ప్రభుత్వం
ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో తబ్లీగ్ జమాత్ సమావేశం నిర్వహించి దేశంలో కరోనా ప్రబలేందుకు కారణమయ్యారని మౌలానా సాద్ పై పోలీసులు కేసు నమోదు చేయడం తెలిసిందే. మరోవంక మౌలానా సాద్ ప్రైవేటు లాబోరేటరీలో కరోనా పరీక్ష చేయించుకోగా, అతనికి నెగిటివ్ వచ్చిందని అతని న్యాయవాది ఫుజైల్ అయూబీ ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులకు నివేదిక సమర్పించారు.
అంటువ్యాధుల చట్టం 1897 కింద మౌలానాపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతోపాటు తబ్లీగ్ జమాత్ కు విదేశాల నుంచి మనీలాండరింగ్ నిబంధనలు ఉల్లంఘించి హవాలా ద్వార విరాళాలు సేకరించారని ఆరోపిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సాద్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.