https://oktelugu.com/

వందల కోట్లు వృథా.. టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిర్వాకం

ఒకటి కాదు.. రెండు కాదు.. వందల కోట్లు.. ప్రజాప్రతినిధిగా గెలిచిన వారందరూ నిధులు కావాలని సీఎంల వెంటపడుతున్నారు. మా నియోజకవర్గంలో ఆ పనిచేయాలి.. ఈ పనిచేయాలి.. నిధులు ఇవ్వండని మొరపెట్టుకుంటారు. సిద్ధిపేట ఎమ్మెల్యే కం మంత్రి హరీష్ రావు అయితే పట్టుబట్టి మరీ నిధులు కేటాయించుకొని సిద్ధిపేటలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుంటారు.కానీ అందరూ ఎమ్మెల్యేలు హరీష్ రావుల ఉండరు కదా.. అదే బాధ.. Also Read: గ్రేటర్ లో ‘ముందస్తు’ ఎన్నికలు? నియోజకవర్గంలో బోలెడన్నీ పనులు చేయడానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : August 29, 2020 / 06:46 PM IST
    Follow us on


    ఒకటి కాదు.. రెండు కాదు.. వందల కోట్లు.. ప్రజాప్రతినిధిగా గెలిచిన వారందరూ నిధులు కావాలని సీఎంల వెంటపడుతున్నారు. మా నియోజకవర్గంలో ఆ పనిచేయాలి.. ఈ పనిచేయాలి.. నిధులు ఇవ్వండని మొరపెట్టుకుంటారు. సిద్ధిపేట ఎమ్మెల్యే కం మంత్రి హరీష్ రావు అయితే పట్టుబట్టి మరీ నిధులు కేటాయించుకొని సిద్ధిపేటలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుంటారు.కానీ అందరూ ఎమ్మెల్యేలు హరీష్ రావుల ఉండరు కదా.. అదే బాధ..

    Also Read: గ్రేటర్ లో ‘ముందస్తు’ ఎన్నికలు?

    నియోజకవర్గంలో బోలెడన్నీ పనులు చేయడానికి ఉంటాయి. తాగునీటి కొరత.. రోడ్లు, డ్రైనేజీలు, హరితహారం, పారిశుధ్యం, తరగతి గదులు, వైద్యశాలలు ఇలా ఎన్నో గ్రామాల్లో పెండింగ్ వర్క్స్ ఉంటాయి. ప్రజలు కూడా ప్రజాప్రతినిధులు కనపడితే చాలు ఈ పని ఆ పని అంటూ సమస్యల చిట్టాను ముందు పెడుతుంటారు. కానీ మన ఎమ్మెల్యేలు మాత్రం నిధులు లేవంటూ తప్పించుకుంటారు.కానీ పైసలు ఇచ్చినా ఖర్చు చేయని మన తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఏమనాలి?

    తాజాగా తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. తెలంగాణ రాష్ట్రంలో గత కేసీఆర్ ప్రభుత్వం 2014-19 కాలంలో ఎమ్మెల్యేలకు , ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులను భారీగా కేటాయించింది. కానీ వాటిని ఖర్చు చేయడంలో వారి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వారి నిర్లక్ష్యం వల్ల ప్రజలకు పనులు కాకుండా వారు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    2014-19 మధ్య గత ఐదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఏకంగా 1440 కోట్లు విడుదల చేసింది. వీటిని నాలాలు, బోర్లు, స్కూల్ బిల్డింగులు, స్ట్రీట్ లైట్లు ఇతర పనులకు నియోజకవర్గాల్లో ఖర్చు చేయాలని సూచించింది. కానీ ప్రజాప్రతినిధులు కేవలం రూ.974 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.

    Also Read: అదే జరిగితే.. హైదరాబాద్ లో తట్టుకోగలమా?

    ఇక ఎమ్మెల్సీలకు తెలంగాణ ప్రభుత్వం రూ.974 కోట్లు కేటాయించగా.. రూ.254 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. తాజాగా ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఓ వ్యక్తి దరఖాస్తు చేయగా.. మన ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం బయటపడింది.

    ఇలా డబ్బులిచ్చినా కూడా పనిచేయని ఖర్చు చేయని మన ఎమ్మెల్యేల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధులు ఖర్చు చేస్తే పర్సంటేజిల ద్వారా కూడా సంపాదించుకునే అవకాశం ఉన్నా మన ప్రజాప్రతినిధుల బద్దకం కారణంగా ఆ నిధులు మురిగిపోయాయి.

    -ఎన్నం