
సూపర్ స్టార్ మహేశ్ బాబు, సూపర్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ది హిట్ కాంబినేషన్. ‘అతడు’ మూవీతో మహేశ్ కెరీర్ టర్న్ చేశాడు త్రివిక్రమ్. ‘పోకిరి’ తర్వాత వరుస ఫ్లాప్స్ ఎదురై.. ఎలాంటి కథ ఎంచుకోవాలో తెలియని అయోమయంలో పడ్డ సూపర్ స్టార్ తో ‘ఖలేజా’ తీశాడు. ఈ మూవీతో అతనిలోని హ్యమర్, కామెడీ యాంగిల్‌ను బయటకు తీసి.. సరికొత్త మహేశ్‌ను పరిచయం చేసిన ఘనత త్రివిక్రమ్‌దే అనొచ్చు. అక్కడి నుంచి ప్రతి సినిమాలో తమ మార్కు హ్యూమర్ ఉండేలా చూసుకుంటున్నాడు సూపర్ స్టార్. 2010లో రిలీజైన ఖలేజా తొలుత డివైడ్ టాక్ తెచ్చుకున్నా.. తర్వాత ప్రేక్షకులను బాగా ఆకట్టుంది. తన కెరీర్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంటుందని మహేశ్ చాలా సార్లు చెప్పాడు. అయితే, ఈ పదేళ్లలో మహేశ్, త్రివిక్రమ్ మళ్లీ కలిసి పని చేయలేకపోయారు. ఒకటి రెండు సార్లు వీరిద్దరి కాంబినేషన్ కుదిరిందన్న వార్తలు వచ్చినా మూవీ పట్టాలెక్కలేదు. ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడమే అందుకు కారణం అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దాని వల్ల ఇద్దరి మధ్య కొంత గ్యాప్ కూడా ఏర్పడిందట. అందుకే ఒకరిపై ఒకరికి అభిమానం, గౌరవం, ప్రేమ ఉన్నప్పటికీ పదేళ్లుగా వీళ్ల కాంబినేషన్‌లో మరో సినిమా రాలేదని అంటున్నాయి.
Also Read: హాలీవుడ్ స్టార్ హీరో కన్నుమూత
అయితే, తాజా సమాచారం మేరకు మహేశ్, త్రివిక్రమ్ మళ్లీ కలిశారు. వీరిద్దరి కాంబినేషన్లో మూడో సినిమా రాబోతోందని తెలుస్తోంది. మహేశ్ కోసం త్రివిక్రమ్ పవర్ ఫుల్ స్క్రిప్టు రెడీ చేశాడట. లాక్‌డౌన్ విరామంలో దాదాపు ఐదు వారాల పాటు కష్టపడి మంచి కథ, కథనం రాశాడని సమాచారం. ఇప్పటికే మహేశ్‌కు పాయింట్ చెప్పాడని తొందర్లోనే స్క్రిప్టు చెప్పాలని నిర్ణయించుకున్నాడట. అంతా సవ్యంగా సాగితే మహేశ్- త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడో చిత్రాన్ని హారిక, హాసిని క్రియేషన్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: నాగార్జున వైల్డ్ డాగ్ లుక్ అదుర్స్.. షూటింగ్ ఎప్పుడంటే
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘సరిలేరు నీకెవ్వరూ’తో హిట్ ఖాతాలో వేసుకున్న మహేశ్ ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చేయాల్సి ఉంది. తొందర్లోనే ఈ మూవీ షూటింగ్ షురూ కానుంది. మరోవైపు అల్లు అర్జున్‌తో ‘అల వైకుంఠపురములో’తో భారీ విజయాన్ని సొంతం చేసుకొని ఫామ్‌లోకి వచ్చిన త్రివిక్రమ్.. జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమాకు కమిటయ్యాడు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన వెంటనే మహేశ్- త్రివిక్రమ్ కాంబో తెరపైకి రానుంది. అదే జరిగితే ఇద్దరి అభిమానులకు పండగే.