Telangana: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మళ్లీ కేసీఆర్ ఎన్నిక కానున్నారు. ఈసారి పార్టీ అధ్యక్షుడిగా కేటీఆర్ ను ప్రకటిస్తారని వార్తలు వెలువడ్డాయి. కానీ అదేమీ లేనది తేలిపోయింది. పార్టీ అధ్యక్ష బాధ్యతలను మరోమారు కేసీఆర్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రులు అందరు కలిసి కేసీఆర్ పేరును ప్రతిపాదించారు. దీంతో ఇక పోటీ లేనట్లేనని తేలిపోయింది. ఈసారి కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ నియమితులు కానున్నారు.

ప్రతిపక్షాలను ఎదుర్కొనే క్రమంలో కేటీఆర్ కు అంత సత్తా లేదనే కారణంతోనే మంత్రులు కేసీఆర్ నాయకత్వంపై భరోసా పెంచుకున్నారు. ఇందులో భాగంగానే ఆయనను ప్రెసిడెంట్ గా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కేసీఆర్ ను తమ నేతగా గుర్తిస్తున్నారు.
బీజేపీ, కాంగ్రెస్ కూడా బలపడుతున్న తరుణంలో టీఆర్ఎస్ కూడా తన బలం నిరూపించుకునే క్రమంలో కేసీఆర్ సేవలు అవసరమని పార్టీ నేతలు భావించే ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 22 వరకు నామినేషన్ల స్వీకరణ, 23న పరిశీలన, 25న ఎన్నిక ఉంటుంది. దీంతో మంత్రులంతా ఏకతాటిపైకి వచ్చి కేసీఆర్ నే ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేసే ఎత్తుగడలు వేయడంలో కేసీఆర్ ది అందెవేసిన చేయి. అందుకే రెండు మార్లు సునాయాసంగా అధికారం చేజిక్కించుకున్న పార్టీని మూడోసారి కూడా అధికార పీఠంపై నిలబెట్టాలని తాపత్రయ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటి నుంచే వ్యూహాలు ఖరారు చేస్తున్నట్లు సమాచారం. బీజేపీ, కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: KCR: ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ సంచలన ప్రకటన
ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం జరిగినా అలాంటిదేమీ ఉండదని కేసీఆర్ చెబుతున్నారు. పూర్తిస్థాయిలో కాలం ముగిశాకే ఎన్నికలకు వెళతామని ప్రకటిస్తున్నారు. దీంతో రాబోయే ఎన్నికలపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఒకదశలో వచ్చే ఏడాది ఆగస్టులో ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం జరుగుతున్నా అందులో నిజం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: MODI: బీజీపీ ‘కశ్మీర్’ వ్యూహం.. వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసమేనా..?