Minister KTR: తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీలు లెక్కల పంచాయతీని తెగకుండా సాగదీసుకుంటూనే ఉన్నాయి. తాము తెలంగాణకు లక్షల కోట్లు ఇచ్చామని మోదీనో అమిత్ షాతో సందర్భం వచ్చినప్పుడు చెబుతూంటారు. అదంతా అబద్దమని.. ఇచ్చినట్లుగా నిరూపిస్తే రాజీనామా చేస్తామని.. ముక్కుకు నేలకు రాస్తామని టీఆర్‌ఎస్ అగ్రనేతలు సవాళ్లు చేస్తూంటారు. ఇది ఆరేడు నెలలుగా సాగుతూనే ఉంది. కానీ ఎవరూ లెక్కలు బయట పెట్టడం లేదు. ఎవరు లెక్కలు వారు చెబుతున్నారు కానీ రెండువర్గాలూ అంగీకరించడం లేదు. తాజాగా తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో తాము రూ.2.5 లక్షల కోట్లు ఇచ్చామని అమిత్ షా ప్రకటించారు.

దీనిపై కేటీఆర్ స్పందించారు. అంత ఇచ్చి ఉంటే తాను రాజీనామా చేస్తానన్నారు. వెంటనే బండి సంజయ్ అందుకున్నారు. రాజీనామాకు రెడీకావాలన్నారు. కానీ నిధుల వివరాలు మాత్రం బయట పెట్టలేదు. కేంద్రం ఇచ్చినట్లుగా చెబుతున్న రూ.2.5 లక్షల కోట్ల వివరాలను బయట పెట్టడం ఎంత సేప ? కానీ అలా పెట్టకుండా వీలైనంతగా రాజకీయం చేస్తూనే ఉన్నారు. అసలు తెలంగాణకు ఇచ్చిందేమీ లేదు.. తెలంగాణ నుంచి తీసుకున్నదే ఎక్కువని టీఆర్‌ఎస్ వాదిస్తోంది.
Also Read: AP SSC Results: పదో తరగతి ఫలితాల్లో ‘ఏపీ సర్కారు’ ఫెయిల్
తెలంగాణ నుంచి ఎంత పన్నులు వసూలు చేశారు.. తిరిగి పన్నుల వాటా కింద ఎంత తిరిగిచ్చారు అన్న లెక్కల్ని గతంలో బయట పెట్టారు. అయితే కేంద్ర పథకాలు.. జాతీయరహదారులు.., జాతీయప్రాజెక్టుల కింద తెలంగాణలో ఖర్చు పెట్టింది.. రాష్ట్రానికి కాదా అని బీజేపీ ప్రశ్నిస్తోంది. నిజానికి అసలు ఎవరు ఎవరికి ఇస్తున్నారో అటు బీజేపీ.. ఇటు టీఆర్‌ఎస్ అగ్రనేతలకు తెలుసు. ఎందుకంటే వారు అధికారాల్లో ఉన్నారు. కానీ వారు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ప్రజలతో రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం అర్థం కాక.. రెండుపార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో వాదులాడుకుంటూ వస్తున్నారు.
రేప్ ఇష్యూ డైవర్ట్ కోసమే..
తాజాగా తెలంగాణ ముఖ్యమైన మంత్రి కె.తారకరామారావు మరోమరు లెక్కల పంచాయితీ తెరమీదకు తెచ్చారు. వాస్తవంగా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మైనర్ బాలిక రేప్ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. దీనిని బీజేపీ ఓన్ చేసుకుని మరింత రెచ్చిపోతోంది. గులాబీ నేతలు కిక్కురు మనడం లేదు. రెండు రోజుల క్రితం ట్విట్టర్‌లో మాత్రమే కేటీఆర్ స్పందించారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వెళ్లిన కేటీఆర్ బాలిక రేప్ ఘటనపై స్పందించలేదు. దానిని నుంచి ప్రజలు, పార్టీల దృష్టిని మళ్లించేందుకు మళ్లీ కేంద్రానికి ఎంతిచ్చాం.. కేంద్రం ఎంతిచ్చిందనే లెక్కలు ముందట వేసుకున్నారు. తాను చెప్పిన లెక్కల కంటే రూపాయి ఎక్కువ ఇచ్చినా పదవికి రాజీనామా చేస్తానని మరోమారు సవాల్ చేశారు. గతంలో వరంగల్‌లో సవాల్ చేసినప్పుడే బీజేపీ నేతలు రూ.3.5 లక్షలు రాష్ట్రానికి ఇచ్చినట్లు లెక్కలు చెప్పారు. దీంతో కొన్నాళ్లు సైలెంట్ అయిన కేటీఆర్ తాజాగా బాలిక గ్యాంగ్ రేప్ ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నంలో మళ్లీ లెక్కల పంచాయితీ తెరపైకి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ఫ్రభుత్వం కనుసన్నల్లో ఉన్న దిన పత్రికలు బాలికపై గ్యాంగ్‌రేప్‌ను అటుంచి కేటీఆర్ సవాల్‌నే పతాక శీర్షికన ప్రచురించడం డైవర్ట్ పాలిటిక్స్‌కు నిదర్శనమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read:Krishnapatnam Thermal Power Plant: కృష్ణపట్నం థర్మల్ కేంద్ర షట్ డౌన్ వెనుక కుట్ర ఇదా?