జాతీయ వార్తలుకేటీఆర్ బ‌ర్త్ డేః మొత్తం రివ‌ర్స్ లో వేడుక‌లు!

కేటీఆర్ బ‌ర్త్ డేః మొత్తం రివ‌ర్స్ లో వేడుక‌లు!

ktr

‘‘నా పుట్టిన రోజు సందర్భంగా ఎవ‌రూ డ‌బ్బులు వృథా చేయొద్దు.. సేవా కార్య‌క్ర‌మాల‌కు వినియోగించాలి. విక‌లాంగుల‌కు ట్రై స్కూట‌ర్ల‌ను పంపిణీ చేద్దాం. నా వంతుగా వంద స్కూట‌ర్ల‌ను ఇస్తున్నాను. మీరు కూడా ఇదేవిధంగా చేయండి’’ అంటూ టీఆర్ఎస్ పార్టీ నేత‌ల‌కు సూచించారు కేటీఆర్‌. ప‌లువురు నేత‌లు కూడా అలాగేని త‌లూపారు. కానీ.. బ‌ర్త్ డే రోజుకు ప‌రిస్థితి మొత్తం మారిపోయింది.

వార్తా ప‌త్రిక‌ల్లో జాకెడ్ యాడ్స్ వ‌చ్చేశాయి. టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌క‌ట‌న‌లు హోరెత్తుతున్నాయి. ఇక‌, బ్యాన‌ర్లు, కేకులు కోయ‌డాల‌కు అంతే లేదు. మొత్తంగా.. కేటీఆర్ బ‌ర్త్ డేను గులాబీ పండ‌గ‌లా సెల‌బ్రేట్ చేస్తున్నారు నేత‌లు. అయితే.. ఈ ప‌రిస్థితి గ‌తంలో ఉన్నా.. ఇంత‌లా మాత్రం లేదు. మ‌రి, ఎందుకు ఈ స్థాయిలో వేడుక‌లు చేస్తున్నారు? అనే ప్ర‌శ్న తెర‌పైకి వ‌స్తోంది. కేటీఆర్ ఇప్పుడే.. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారా? అంటే అదీ లేదు. మంత్రి కూడా ఎప్పుడో అయ్యారు. మ‌రి, రీజ‌న్ ఏంట‌న్న‌ప్పుడు ఆ ఒక్క కార‌ణ‌మే క‌నిపిస్తోంది.

కేటీఆర్ తెలంగాణ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌బోతున్నారు అనే చ‌ర్చ గ‌త కొంత కాలంగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ముందు ఇక‌, సీటు మీద కూర్చోవ‌డ‌మే త‌రువాయి అన్న‌ట్టుగా వాతావర‌ణం మార్చేశారు. అయితే.. దుబ్బాక‌లో దెబ్బ త‌గ‌ల‌డం.. జీహెచ్ఎంసీలో లెక్క‌లు మారిపోవ‌డంతో కేసీఆర్ వెన‌క‌డుగు వేశార‌నే ప్ర‌చారం జ‌రిగింది.

అయితే.. ఇప్పుడు మ‌ళ్లీ సానుకూల వాతావ‌ర‌ణం వ‌చ్చింది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం, నాగార్జున సాగ‌ర్లోనూ గులాబీ జెండా ఎగ‌ర‌డంతో.. మ‌ళ్లీ కారు టాప్ గేరులోకి వ‌చ్చేసిందనే ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో.. యువ నేత‌కు ప‌ట్టాభిషేకం జ‌రిపే అవ‌కాశం అతి త్వ‌ర‌లోనే ఉండొచ్చ‌నే ప్ర‌చారం కూడా సాగుతోంది. ఈ కార‌ణంగానే.. ఈ పుట్టిన రోజు సంబ‌రాల‌ను అంబ‌రాన్నంటేలా జ‌రుపుతున్నార‌ని స‌మాచారం. రామోజీరావు వంటి మీడియా దిగ్గ‌జాలు కూడా.. కేటీఆర్‌ గొప్ప ప‌ద‌వులు అలంక‌రించాల‌ని కోరుతూ శుభాకాంక్షలు తెలుపుతుండ‌డం గ‌మ‌నించాల్సిన అంశంగా చెబుతున్నారు. మ‌రి, ఇందులో వాస్త‌వం ఎంత‌? ఆ ముహూర్తం ఎప్పుడు? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Minister KTR: ఎక్కడ తగ్గాలో తెలుసుకున్న కేటీఆర్‌

ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినా పేపర్‌ టీకేజీలు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, నిర్వహించిన పరీక్షల ఫలితాలు ప్రకటించకపోవడం, ప్రటకించినా ఉద్యోగాలు ఇవ్వకపోవడం వంటి కారణాలతో ఈసారి తెలంగానలో నిరుద్యోగులు, విద్యార్థులు గులాబీ పార్టీపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

JP – KTR : మేధావి జేపీ.. సడెన్ గా బీఆర్ఎస్ కు ఎందుకు జై కొట్టాడు?

గతంలో కేసీఆర్‌ సర్కార్‌ వైఫల్యాలపై ఇదే జయప్రకాశ్‌ నారాయణ విమర్శలు చేశారు. మీడియా సమావేశాల్లో దళితబంధు స్కీంను తప్పు పట్టారు.

Most Popular

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.....

13-year-old boy : కమీషన్ ఇస్తేనే పనిచేస్తారా.. 13 ఏళ్ల బాలుడి ప్రశ్నకు కలెక్టర్ కు నోటి మాట...

13-year-old boy : అది కలెక్టర్ కార్యాలయం.. కలెక్టర్.. ఇతర అధికారులు ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. వారంతా కూడా తమ సమస్యల మీద...

Malla Reddy : మల్లారెడ్డి హ్యాండిచ్చాడు.. బీఆర్ఎస్ కారాలు మిరియాలు.. ట్విస్ట్ అదిరింది కదూ

Malla Reddy : మైక్ పట్టుకుంటే చాలు మల్లారెడ్డి కేటీఆర్.. కెసిఆర్.. హరీష్ రావు మీద పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. నూరేళ్లు కాదు వెయ్యిళ్లు బతకాలని కోరుతుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని బాగు...

Harish Rao: బామ్మర్ది కేటీఆర్ ను సైడ్ చేసిన హరీష్.. ఏదో జరుగుతోంది

Harish Rao: భారత రాష్ట్ర సమితి ఓవైపు సోషల్ మీడియాలో బలంగా కనిపిస్తుంది. ఆ పార్టీ అగ్ర నాయకులు కేటీఆర్.. హరీష్ రావు నిత్యం ఆందోళనలకు పిలుపునిస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం...
Exit mobile version