Telangana Jobs Notification 2022: తెలంగాణలో కొలువుల జాతర ప్రారంభమైంది. ఎట్టకేలకు ప్రభుత్వం దాదాపు 80 వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడిన నేపథ్యంలో నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచనలు చేయడంతో ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. నిరుద్యోగుల ఆశలు నెరవేరేలా ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టడంతో సమస్య తీరినట్లే అని భావిస్తున్నారు. మొత్తానికి నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలు కావడంతో నిరుద్యోగులు సైతం సన్నద్ధత వ్యక్తం చేస్తున్నారు. పోటీ పరీక్షల కోసం ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారు. కోచింగ్ సెంటర్లు కూడా కళకళలాడుతున్నాయి.

Telangana Jobs Notification 2022
ఇక రెండు మూడు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. గతంలో మాదిరిగానే ఆఫ్ లైన్ లో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో టీచర్ పోస్టులను డీఎస్సీ, టీఆర్టీ ద్వారా భర్తీ చేస్తున్నారు. దీంతో నిరుద్యోగులు తమ అధృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగాలు సాధించేందుకు నిరుద్యోగులు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
Also Read: హిజాబ్ వివాదంపై సంచలన తీర్పునిచ్చిన హైకోర్టు..
మరోవైపు పోలీస్ ఉద్యోగ నియామకాల కోసం కూడా నోటిఫికేషన్ వెలువరించేందుకు సన్నద్ధం అవుతోంది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి కసరత్తు ప్రారంభించింది. ఖాళీల వారీగా వివరాలు సేకరించి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు తయారవుతోంది. ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతో నిరుద్యోగులు కోచిం్ తీసుకునేందుకు సమాయత్తమవుతున్నారు.

Free Job Alert Telangana
ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. అన్ని విభాగాల్లో ఖాళీలుండటంతో ఏ రంగంలోనైనా తమకు ఉన్న పట్టుతో ఉద్యోగం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. నచ్చిన జాబ్ దొరికించుకునేందుకు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగాల సాధనకు నిరుద్యోగులు సంసిద్ధులు అవుతున్నారు.
Also Read: అరగంటలోనే కోమటిరెడ్డికి ప్రధాని అపాయింట్ మెంట్.. ఏం జరుగుతోంది..?