Bigg Boss OTT Telugu Tejaswi Madivada: బిగ్ బాస్ లో ఎప్పుడు ఎలాంటి వాతావరణం ఉంటుందో చెప్పడం ఎవరి తరం కాదు. అప్పటివరకు స్నేహితులుగా ఉన్న వారు ఒక్కసారిగా శత్రువులుగా మారిపోవడం.. శత్రువులు స్నేహితులుగా మారడం చాలా కామన్. ఇక నామినేషన్ ప్రక్రియ వచ్చినప్పుడు ఎవరి మనసులో ఏముందో బయట పడుతుంది. నిన్న సోమవారం నామినేషన్ ప్రక్రియలో తేజస్వి మదివాడ కూడా ఇలాగే చేసింది.

కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు టాస్క్ లో భాగంగా మొదటగా నామినేషన్ చేసే ఛాన్స్ కొట్టేసింది. ఈ క్రమంలోనే అరియాన, చైతుల మీద దారుణమైన కామెంట్ చేసింది. వారిద్దరి ఫ్రెండ్ షిప్ మీద ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. వారిద్దరూ బయట మాట్లాడుకుని ఇక్కడ గేమ్ ఆడుతున్నారని, సోలోగా ఆడట్లేదు అని ఇది కరెక్ట్ కాదు అంటూ మండిపడింది.
Also Read: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ అప్ డేట్స్
అరియాన పక్కనే ఉండి గోతులు తవ్విందంటూ పరువు తీసేసింది తేజస్వి. ఇలాంటి బిహేవియర్ అసలు కరెక్ట్ కాదు అంటూ తేల్చి చెప్పింది. తాము గతంలో పోలీస్-స్మగ్లర్ టాస్క్ ఆడినప్పుడు వారి బాగోతం బయటపడింది అని చెప్పుకొచ్చింది. చెక్ పోస్ట్ దగ్గర ముందుగానే ఉన్న అరియాన, చైతులు కుర్చీలను అడ్డుగా పెట్టుకుని ఏదో చేస్తుండటం తాను గమనించానని చెప్పుకొచ్చింది.

వారు కుర్చీల చాటున లుంగీలో ఏదో చేస్తుండటాన్ని చూశానని టాస్క్ లో భాగంగా దాన్ని బయట పెట్టాలనే ఉద్దేశంతో ఆ కుర్చీలను తన్నాలని అనుకున్నట్లు వివరించింది. అయితే కుర్చీలు విరిగిపోవడంతో చాలామంది తనను బ్యాడ్ చేయాలని చూశారని ఆరోపించింది. అలా వారిద్దరూ కలిసి తనను బ్లేమ్ చేయాలని చూస్తున్నారని కాబట్టి వారిని నామినేట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. తేజస్వి కామెంట్లపై అటు చైతూ కూడా మండిపడ్డాడు. మొత్తానికి నామినేషన్ ప్రక్రియ ఇలా రసవత్తరంగా సాగింది.
Also Read: టీకాంగ్రెస్‌లో అసంతృప్త రాజకీయాలు.. పంజాబ్‌ను చూసైనా మారండయ్యా..!
[…] Varun Tej Ghani Movie: కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘గని’. కాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు అయింది. ‘గని’ టీజర్ మార్చి 17న ఉదయం 10.30 కు విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ మూవీలో వరుణ్ తేజ్ బాక్సర్ పాత్రలో కనిపించనున్నారు. […]