Telangana Hikes Power Tariff: రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు అనేవి చాలా కామన్. అయితే అధికారంలో ఉన్న ఒక పార్టీ ఏ చిన్న మిస్టేక్ చేసినా ప్రతిపక్షాలు ఆడేసుకోవడానికి రెడీగా ఉంటాయి. వేటి ధరలు పెంచినా నానా రాద్ధాంతం చేస్తుంటాయి ప్రతిపక్షాలు. అయితే ఈ విమర్శలను ముందుగానే పసిగట్టి అలాంటివి ఎదురుకాకుండా తన న న వైపు ప్రజలు అనుకూలంగా ఉండే విధంగా చేసేవాడే నిజమైన రాజకీయ నాయకుడు.

ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న సమయంలోనే వారి దృష్టిని సంపూర్ణంగా మరల్చి తన వైపు తిప్పుకోవడమే రాజనీతి. ఈ విషయంలో కేసీఆర్ బాగా ఆరితేరారు. గతంలో హుజురాబాద్ ఎన్నికల ఎఫెక్ట్ ను రాష్ట్ర వ్యాప్తంగా పడకుండా వరి ధాన్యం కొనుగోలు విషయాన్ని తెరపైకి తెచ్చి.. బీజేపీని ఇరకాటంలో పడేశారు. వడ్ల రాజకీయంలో కేసీఆర్ మొదటి నుంచి పైచేయి సాధిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో పెరుగుతున్న ఖర్చుల రీత్యా అర్జెంటుగా కరెంటు బిల్లును పెంచాల్సి వచ్చింది గులాబీ బాస్ కు.
Also Read: Naatu Naatu Song Copied: ‘నాటు నాటు’ సాంగ్ కి స్టెప్స్ జక్కన్న అక్కడ నుంచి తీసుకున్నారా ?
ఎలాంటి ఆందోళనలు లేని సమయంలో ఈ చార్జీలు పెంచితే అటు ప్రతిపక్షాలు ఇటు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారని కేసీఆర్ కు బాగా తెలుసు. అందుకే సమయం కోసం ఎదురు చూశారు. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుందనే సంకేతాలు వచ్చిన వెంటనే.. గులాబీ బాస్ తన మైండ్ కి పనిపెట్టారు. పెట్రోల్ ధరలను హైలెట్ చేస్తే తాను కరెంట్ చార్జీలు పెంచినా కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోరు అనేది కెసిఆర్ మాస్టర్ ప్లాన్.
ఇంకేముంది అనుకున్నట్టుగానే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్న సమయంలోనే తెలంగాణలో కరెంట్ చార్జీలు పెంచేశారు కేసీఆర్. అయితే ప్రతిపక్షాల కంటే ముందు తమ పార్టీనే నిరసన గళాన్ని వినిపించింది. ఎవరు ముందు ధర్నాలు చేస్తే వారే జనాల్లో హైలెట్ అవుతారనేది కేసీఆర్ కు బాగా తెలుసు. అందుకే బిజెపికి ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా పెట్రోల్ రేట్లపై టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. కేంద్రం సామాన్యులపై ధరల భారం వేస్తోందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

ఇదే అంశాన్ని బాగా హైలెట్ చేసే విధంగా గ్రామ గ్రామాన టిఆర్ఎస్ దళం ఆందోళనలు నిర్వహిస్తోంది. ఇంకో వైపు కేంద్రం కావాలనే తెలంగాణ రైతుల వరి ధాన్యం కొనడంలేదని.. ఆ నిరసన కార్యక్రమాలను కూడా హైలెట్ చేస్తున్నారు. ఇలా రెండు అంశాలను తెరపైకి తెచ్చి.. తాము కరెంటు చార్జీలను పెంచిన విషయాన్ని జనాలు మర్చిపోయేలా చేయాలని చూస్తున్నారు కేసీఆర్. కానీ అటు బిజెపి, కాంగ్రెస్ కూడా అలర్ట్ అయిపోయాయి. కాస్త లేటుగా స్పందించిన బీజేపీ నేతలు.. కరెంటు చార్జీలపై పోరుబాట పాడుతామంటున్నారు. కానీ కేసీఆర్ ఇప్పటికే ధర్నాతో జనాల మైండ్ టచ్ చేశారు. మరి బీజేపీ నేతలు ఏ మేరకు ఈ కరెంట్ చార్జీల విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్తారో.. ఏ మేరకు వ్యతిరేకత తీసుకువస్తారో చూడాలి.
Also Read: Celebrities Heap Praise On RRR: ఆర్ఆర్ఆర్‌పై సినీ హీరోల ప్రశంసలు.. ఎవరెవరు ఏం చెప్పారంటే..