Homeఎంటర్టైన్మెంట్SS Rajamouli RRR Movie: ఆ సీన్లతో అందరి నోళ్లు మూయించిన రాజమౌళి.. నువ్వు తోపు...

SS Rajamouli RRR Movie: ఆ సీన్లతో అందరి నోళ్లు మూయించిన రాజమౌళి.. నువ్వు తోపు సామీ..

SS Rajamouli RRR Movie: నాలుగేళ్ల నిరీక్షణకు తెరపడింది. అన్ని వర్గాల సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజమౌళి తెరకెక్కించిన మాయాజాలం.. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో ఈ మూవీకు మొదటి నుంచి ఎక్కడలేని క్రేజ్ ఏర్పడింది. పైగా ఇండస్ట్రీలో నందమూరి, మెగా ఫ్యామిలీలు టాప్ ప్లేస్ లో ఉన్నాయి. అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు హీరోలు కలిసి నటించడం అంటే మామూలు విషయం కాదు.

Rajamouli
Rajamouli

ఒక స్టార్ హీరో ఉంటేనే ఎన్నో అనుమానాలు ఉంటాయి. అలాంటిది ఎన్నో ఏళ్ల తర్వాత ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో జక్కన్న మీద చాలా అనుమానాలు రేకెత్తాయి. ఇద్దరు హీరోల అభిమానులను అతను మెప్పించగలడా.. ఏ ఒక్కరిని తగ్గించినట్లు చూపించినా వారి ఫ్యాన్స్ అస్సలు ఒప్పుకోరు. ఎంత పెద్ద గొడవ చేస్తారో రాజమౌళికి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాపై వచ్చిన అతి పెద్ద రూమర్లలో.. హీరోల పాత్రల మధ్య హెచ్చుతగ్గులు అనేది రాజమౌళి మొదటి నుంచి ఉన్న టెన్షన్.

Also Read: Naatu Naatu Song Copied: ‘నాటు నాటు’ సాంగ్ కి స్టెప్స్ జక్కన్న అక్కడ నుంచి తీసుకున్నారా ?

అయితే సినిమాను తెరకెక్కించడంలో రాజమౌళి చాలా పెద్ద దిట్ట. ఆయన సినిమాలు ఎక్కువగా ప్రేక్షకుడు కథలో లీనమయ్యే విధంగా ఉంటాయి. అదే ఆయన సక్సెస్ ఫార్ములా. ఇప్పుడు త్రిబుల్ ఆర్ విషయంలో కూడా అదే జరిగింది. హెచ్చుతగ్గులు అనుమానాలు రేకెత్తిస్తున్న వారందరికీ ఈ సినిమాలోని కొన్ని సీన్లతో సమాధానం చెప్పాడు జక్కన్న. ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మధ్య వచ్చే సీన్లలో గ్రాఫిక్స్ ఎంత అద్భుతంగా ఉన్నా కూడా.. ఎమోషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు రాజమౌళి.

SS Rajamouli
SS Rajamouli

వీరిద్దరి మధ్య వచ్చే ఫ్రెండ్షిప్ సీన్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. అందరి ఊహకు మించి ఆ సీన్ లను పండించాడు జక్కన్న. ఈ సీన్లను చూసిన వారికి.. హెచ్చుతగ్గులు అనే ప్రశ్నకు సమాధానం దొరికేసింది. రాజమౌళి ఎవరినీ తక్కువ చేసి చూపించలేదని తన సినిమాల్లో పాత్రలకు ప్రాణం పోశాడని అర్థమవుతుంది. ఇలాంటి ఎమోషనల్ సీన్లను తీయడంలో రాజమౌళికి ఎవరు పోటీలేరని మరోసారి నిరూపించుకున్నాడు.

Also Read: కూలీ కూతురు ఇలా సాధించింది.. ఏకంగా రూ.44 లక్షల జీతం కొట్టేసింది

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

2 COMMENTS

  1. […] KGF 2 Update: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వస్తున్న ‘కేజీఎఫ్ 2’ కోసం యావత్తు మాస్ ప్రేక్షక లోకం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తోన్నారు. ఏప్రిల్‌ 14న సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ప్రభాస్ హాజరు కాబోతున్నారు. […]

  2. […] Megastar Chiranjeevi: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలై రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పటికే పలుచోట్ల ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేసింది. రాజమౌళి బృందం రికార్డు స్థాయి సక్సెస్ సాధించడం పై అభిమానులు, ప్రముఖులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ… చిత్ర యూనిట్ కు విషెస్ తెలియజేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ చిత్రం ఘన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular