తెలంగాణ ఆరోగ్య మంత్రి సోమేశ్ కుమార్

రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను సీఎం కేసీఆర్ తొలగించారు. తక్షణమే ఆ శాఖను తన ఆధీనంలోకి తీసుకున్నారు. అయినా రివ్యూ మీటింగులు పెట్టలేదు. ఎక్కడా తిరగలేదు. కానీ ప్రతిరోజు ఆరోగ్య శాఖపై ఆరా తీస్తున్నారు. ఈటల రాజేందర్ ఉన్నప్పుడు రోజూ పలు ప్రాంతాలు తిరుగుతూ ప్రజలకు భరోసా కల్పిస్తూ కరోనా వ్యాప్తిపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆయన అందుబాటులో లేకపోవడంతో ఒక కొత్త వ్యక్తి ఆ పాత్ర పోషిస్తున్నారు. ఆయన […]

Written By: Srinivas, Updated On : May 9, 2021 6:31 pm
Follow us on

రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను సీఎం కేసీఆర్ తొలగించారు. తక్షణమే ఆ శాఖను తన ఆధీనంలోకి తీసుకున్నారు. అయినా రివ్యూ మీటింగులు పెట్టలేదు. ఎక్కడా తిరగలేదు. కానీ ప్రతిరోజు ఆరోగ్య శాఖపై ఆరా తీస్తున్నారు. ఈటల రాజేందర్ ఉన్నప్పుడు రోజూ పలు ప్రాంతాలు తిరుగుతూ ప్రజలకు భరోసా కల్పిస్తూ కరోనా వ్యాప్తిపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆయన అందుబాటులో లేకపోవడంతో ఒక కొత్త వ్యక్తి ఆ పాత్ర పోషిస్తున్నారు. ఆయన ఎవరో కాదు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.

మార్పులు చేర్పులు ఎప్పుడో?
మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు ఎప్పుడు చేపడతారోనని ఎదురు చూస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖను తన దగ్గర పెట్టుకున్న సీఎం కేసీఆర్ బాధ్యతలను సీఎస్ సోమేశ్ కుమార్ కు అప్పగించడంతో ఆయన తలమునకలవుతున్నారు. ప్రతి రోజు రివ్యూ మీటింగులు పెట్టి ఉద్యోగులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. తన విధితో పాటు ఆరోగ్య శాఖ మంత్రి అవతారమెత్తడంతో సీఎస్ కు అదనపు బాధ్యతలు నెత్తిన పడ్డాయి.

కరోనా నేపథ్యంలో..
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆరోగ్య శాఖ బాధ్యతలను డీల్ చేయడమంటే మాటలు కాదు. ఎన్నో ప్రయాసలు, బాధ్యతలు ఉంటాయి. కీలక సమయంలో ఈటల రాజేందర్ ను తొలగించిన కేసీఆర్ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా సీఎస్ పై గురుతర బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన అటు కాదనలేక ఇటు చేయలేక ఆపసోపాలు పడుతున్నారు. మంత్రుల విధులు వేరే ఉంటాయి. అధికారుల పనితీరు మరోలా ఉంటుంది. అయినప్పటికీ తన పరిది దాటి విధులు నిర్వహిస్తూ ముందుకు వెళుతున్నారు.

ముహూర్తమెప్పుడో ?
మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడో అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. మంత్రి పదవి ఎవరిని వరిస్తుందోనని ఆశావహులు ఆశల డోలికల్లో ఊగిసలాడుతున్నారు. ఆరోగ్య శాఖ ఎవరిని వరిస్తుందోనని ఊరిస్తున్నారు. సీఎం కేసీఆర్