దేశ హ్యాపీనెస్‌ ఇండెక్స్‌లో తెలంగాణకు చోటు

మిజోరాం.. చెప్పుకోడానికి చిన్న రాష్ట్రమే. అక్కడి జనాభా 2001 జనాభా లెక్కల ప్రకారం 8,90,000. అంత చిన్న రాష్ట్రం సంతోషంలో మాత్రం టాప్‌ ప్లేస్‌లో నిలిచిందట. దేశ హ్యాపీనెస్‌ ఇండెక్స్‌ (సంతోష సూచిక)లో మిజోరాం అగ్రస్థానంలో నిలిచిందంటే ఆ దేశం ఎంతటి హ్యాపీలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మిజోరాంతోపాటు టాప్-10 జాబితాలో మరో రెండు ఈశాన్య రాష్ట్రాలు సిక్కీం, అరుణాచల్ ప్రదేశ్‌లకు కూడా చోటు దక్కింది. పెద్ద రాష్ట్రాల పరంగా టాప్-3లో తెలంగాణ రాష్ట్రానికి చోటు దక్కడం […]

Written By: NARESH, Updated On : September 21, 2020 8:50 pm

telanagana

Follow us on

మిజోరాం.. చెప్పుకోడానికి చిన్న రాష్ట్రమే. అక్కడి జనాభా 2001 జనాభా లెక్కల ప్రకారం 8,90,000. అంత చిన్న రాష్ట్రం సంతోషంలో మాత్రం టాప్‌ ప్లేస్‌లో నిలిచిందట. దేశ హ్యాపీనెస్‌ ఇండెక్స్‌ (సంతోష సూచిక)లో మిజోరాం అగ్రస్థానంలో నిలిచిందంటే ఆ దేశం ఎంతటి హ్యాపీలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మిజోరాంతోపాటు టాప్-10 జాబితాలో మరో రెండు ఈశాన్య రాష్ట్రాలు సిక్కీం, అరుణాచల్ ప్రదేశ్‌లకు కూడా చోటు దక్కింది. పెద్ద రాష్ట్రాల పరంగా టాప్-3లో తెలంగాణ రాష్ట్రానికి చోటు దక్కడం విశేషం. గురుగ్రామ్‌లోని మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ రాజేష్ కె పిలానియా ఈ హ్యాపీనెస్ ఇండెక్స్‌ని రూపొందించారు. ఈ ఏడాది మార్చి-–జులై మధ్యలో దేశవ్యాప్తంగా దాదాపు 16,950 మంది ప్రజల అభిప్రాయాలు సేకరించి రూపొందించిన సర్వే ఆధారంగా హ్యాపీనెస్ ఇండెక్స్‌ను ప్రకటించారు.

Also Read : కోవిడ్ నిధులపై బండి-కేటీఆర్ కొట్లాట..!

పని, సంపాదన సంబంధిత సమస్యలు.. కుటుంబం, స్నేహితులతోపాటు వృద్ధి సంబంధాలు.. మానసిక, శారీరక ఆరోగ్యం.. మతపరమైన, ఆధ్యాత్మికపరమైన సామాజిక సమస్యలు, ఫిలాంత్రపీ, హ్యాపీనెస్‌పై కోవిడ్ 19 ప్రభావం వంటి అంశాలను సర్వేలో తీసుకున్నారు. వీటి ఆధారంగా రూపొందించిన హ్యాపీనెస్‌ ఇండెక్స్‌లో టాప్-3లో మిజోరాం, పంజాబ్ రాష్ట్రాలు అండమాన్ నికోబార్ కేంద్రపాలిత ప్రాంతం నిలిచాయి.  పెద్ద రాష్ట్రాల పరంగా చూసుకుంటే పంజాబ్, గుజరాత్, తెలంగాణ టాప్-3లో నిలిచాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో అండమాన్ నికోబార్‌తో పాటు పుదుచ్చేరి, లక్ష్యద్వీప్‌లకు కూడా ఇందులో చోటు దక్కింది.

జాబితాలో పేర్కొన్న రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాల్లో వైవాహిక స్థితి, వయసు, విద్య, ఆదాయ స్థాయిల పరంగా సానుకూల వాతావరణం, సంతోషకర పరిస్థితులు ఉన్నట్లు వెల్లడైంది. అలాగే అవివాహితుల కంటే వివాహితులు సంతోషంగా ఉన్నారని తేలిందట. హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌ అసిస్టెంట్ ప్రొఫెసర్, సమయం, డబ్బు, సంతోషాలకు సంబంధించిన అంశాలపై ప్రముఖ స్కాలర్ డా.ఆష్లే విల్లన్స్ పరిశోధన చేస్తున్నారు.

ఆయన పరిశోధన ప్రకారం.. డబ్బు కంటే సమయానికి ఎక్కువ విలువనిచ్చేవారు మంచి జీవితాన్ని గడుపుతున్నారట. తాజా హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రకారం… ఢిల్లీ,మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ప్రజల సంతోషంపై కరోనా తీవ్ర దుష్ప్రభావం చూపించింది. పుదుచ్చేరి, జమ్మూకశ్మీర్, మణిపూర్ రాష్ట్రాల్లో అక్కడి ప్రజల సంతోషంపై కరోనా ప్రభావం తటస్థంగా ఉంది. ఇక అండమాన్ నికోబార్, లక్ష్యద్వీప్ రాష్ట్రాల్లోని ప్రజల సంతోషంపై అసలు కరోనా ప్రభావం పెద్దగా కనిపించలేదని తెలిపింది. అందుకే హ్యాపీనెస్ ఇండెక్స్‌లో ఈ కేంద్ర పాలిత ప్రాంతాలు టాప్‌లో నిలిచాయి.

Also Read : మోదీకి ట్వీటర్లో కేటీఆర్ కౌంటర్