ఫెయిలైనా విద్యార్థులకు గుడ్ న్యూస్..!

ఈ ఏడాది ఇంటర్మీడియట్లో ఫెయిలైయిన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతుంది. రాష్ట్రంలో కరోనా ఉధృతి దృష్ట్యా పరీక్షలను నిర్వహించే అవకాశం లేదని ప్రభుత్వ యంత్రాంగం భావిస్తోంది. ఈనేపథ్యంలో ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేసేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. నిమ్మగడ్డ నిజాయితీపై నీలినీడలు ఇప్పటికే తెలంగాణ పదో విద్యార్థులందరినీ ప్రభుత్వం పాస్ చేసిన సంగతి తెల్సిందే. ప్రీఫైనల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ చేసింది. కాగా ఇంటర్మీయట్ పరీక్షలు రాష్ట్రంలో లాక్డౌన్ […]

Written By: Neelambaram, Updated On : June 25, 2020 11:51 am
Follow us on


ఈ ఏడాది ఇంటర్మీడియట్లో ఫెయిలైయిన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతుంది. రాష్ట్రంలో కరోనా ఉధృతి దృష్ట్యా పరీక్షలను నిర్వహించే అవకాశం లేదని ప్రభుత్వ యంత్రాంగం భావిస్తోంది. ఈనేపథ్యంలో ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేసేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.

నిమ్మగడ్డ నిజాయితీపై నీలినీడలు

ఇప్పటికే తెలంగాణ పదో విద్యార్థులందరినీ ప్రభుత్వం పాస్ చేసిన సంగతి తెల్సిందే. ప్రీఫైనల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ చేసింది. కాగా ఇంటర్మీయట్ పరీక్షలు రాష్ట్రంలో లాక్డౌన్ విధించడానికి ముందే అయిపోయింది. దీంతో విద్యార్థులకు కొంత ఊరట లభించింది. అనంతరం లాక్డౌన్ విధించారు. ఆ తర్వాత లాక్డౌన్ సడలింపుల్లో పేపర్ వాల్యుయేషన్ చేసి ఇంటర్ రిజల్ట్ ను జూన్ 18న ప్రభుత్వం విడుదల చేసింది.

ఇందులో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 1,92,172మంది ఫెయిలవగా సెకండ్ ఇయర్లో 1,28,169మంది ఫెయిలయ్యారు. మొత్తంగా 3,20,341మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఇంటర్మీయట్ బోర్డు వీరికి ప్రభుత్వం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ఇంటర్మీయట్ బోర్డు సప్లమెంటరీ పరీక్ష తేదిలను విడుదల చేయలేదు. మరోవైపు ఏపీలో ఇంటర్మీడియట్ రిజల్ట్ విడుదల చేసి సప్లమెంటరీ తేదిలను ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత సప్లమెంటరీ పరీక్షలను రద్దుచేసి ఫెయిలైన విద్యార్థులందినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంటర్లో ఫెయిలైన విద్యార్థులను పాస్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

గవర్నర్ కు లేఖలో నిమ్మగడ్డ పేర్కొన్న అంశాలివే..!

ఫెయిల్ విద్యార్థులను ఏవిధంగా పాస్ చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయంలో న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంటర్మీయట్ బోర్డు చర్చిస్తుంది. ఫెయిలైన విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు కలపాలా? లేక కండోనేషన్‌ మార్కులు(సబ్జెక్టుకు 10 నుంచి 15మార్కులు కలపడం) కలపాలా అని ఆలోచిస్తోంది. ఏదోవిధంగా విద్యార్థులందరినీ పాస్ చేసేందుకే ఇంటర్మీయట్ బోర్డు, ప్రభుత్వం మొగ్గుచూపుతుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.