https://oktelugu.com/

తెలంగాణలో మాస్కుల వాడకంపై కీలక ఉత్తర్వులు

దేశంలో కరోనా మహమ్మరి విజృంభిస్తుంది. లాక్డౌన్ అమలుతో దేశంలో కరోనా కేసులు పెరగకుండా అదుపు చేయగలిగింది. అయితే గడిచిన వారంరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో 6వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నాయి. దీంతోపాటు కరోనా రాకుండా చేపట్టాల్సిన అన్ని చర్యలను తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా పలు రాష్ట్రాలు మాస్కు వాడకాన్ని తప్పనిసరి చేశాయి. తాజాగా తెలంగాణ కూడా ఇంట్లో నుంచి బయటికి వచ్చే […]

Written By: , Updated On : April 10, 2020 / 04:26 PM IST
Follow us on


దేశంలో కరోనా మహమ్మరి విజృంభిస్తుంది. లాక్డౌన్ అమలుతో దేశంలో కరోనా కేసులు పెరగకుండా అదుపు చేయగలిగింది. అయితే గడిచిన వారంరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో 6వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నాయి. దీంతోపాటు కరోనా రాకుండా చేపట్టాల్సిన అన్ని చర్యలను తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా పలు రాష్ట్రాలు మాస్కు వాడకాన్ని తప్పనిసరి చేశాయి. తాజాగా తెలంగాణ కూడా ఇంట్లో నుంచి బయటికి వచ్చే ప్రజలు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో కొందరిలో కరోనా లక్షణాలు లేకున్నా పాజిటివ్ వస్తుందని చెబుతుంది. ఈ నేపథ్యంలో ప్రతీఒక్కరు ఇళ్లలోనే ఉండాలని, అవసరమైతేనే బయటికి రావాలని ప్రభుత్వం చూస్తుంది. బయటికి వచ్చేవారు తప్పనిసరిగా ముఖానికి మాస్కు ధరించాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఈమేరకు విధుల్లో ప్రతీ ఉద్యోగి మాస్క్ ధరించాలని పేర్కొంది. మాస్కులు ధరించకుండా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇళ్లలో తయారీచేసిన క్లాత్ మాస్క్ లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 471 కరోనా కేసులు నమోదయ్యాయి. 12మంది మృతిచెందగా 45మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 414 యాక్టివ్ కేసులు ఉన్నాయి.