https://oktelugu.com/

కామెడీయే కరెక్ట్ అంటున్న గోపీచంద్

కామెడీ ఇపుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతోంది. ఒక పక్క టి వి షోలు , మరో పక్క టిక్ టాక్ షోలు, వాట్సాప్ మెసేజ్ లు , సోషల్ మీడియా …ఇలా అనేక రూపాల్లో హాస్యం దర్శనమిస్తోంది. కామెడీ కోసం థియేటర్ల కు వెళ్లకుండా ‘జబర్దస్త్’ ‘అదిరింది’ వంటి కామెడీ షో లు బాగా అడ్డు పడుతున్నాయి. అలాంటి సమయం లో కామెడీ ని నమ్ముకొని ఒక హీరో ముందు కెళ్తున్నాడు . శ్రీను వైట్ల, […]

Written By:
  • admin
  • , Updated On : April 10, 2020 / 04:21 PM IST
    Follow us on


    కామెడీ ఇపుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతోంది. ఒక పక్క టి వి షోలు , మరో పక్క టిక్ టాక్ షోలు, వాట్సాప్ మెసేజ్ లు , సోషల్ మీడియా …ఇలా అనేక రూపాల్లో హాస్యం దర్శనమిస్తోంది. కామెడీ కోసం థియేటర్ల కు వెళ్లకుండా ‘జబర్దస్త్’ ‘అదిరింది’ వంటి కామెడీ షో లు బాగా అడ్డు పడుతున్నాయి. అలాంటి సమయం లో కామెడీ ని నమ్ముకొని ఒక హీరో ముందు కెళ్తున్నాడు .

    శ్రీను వైట్ల, నాగేశ్వర రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి వంటి పేరున్న హాస్యదర్శకులు తమ పంధా మార్చుకొంటున్న తరుణం లో ఈ రకమైన ప్రయోగానికి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంకా చూస్తే అల్లరి నరేష్ వంటి కామెడీ హీరో కూడా తన దారి మార్చుకొని ముందుకెళ్లాలను కొంటున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో కామెడీ మీద ఆధార పడి ఒక సినిమా చెయ్యడం అంటే కాస్త రిస్కే ….అయినప్పటికీ హీరో గోపీచంద్ తనను హాస్యమే గట్టెక్కిస్తుందని గట్టిగా నమ్ముతున్నాడు. ఈ మధ్య వరుస ప్లాప్ లతో గోపీచంద్ కెరీర్ చాలా డల్ అయ్యింది. ప్రస్తుతం హీరో సంపత్ నంది డైరెక్షన్లో ‘సీటీమార్’ అనే చిత్రం చేస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం కబడ్డీ నేపధ్యంలో సాగుతుందని తెలుస్తోంది

    ముందు యాక్షన్ ప్యాక్డ్ సన్నివేశాలతో రూపొందిన ఈ చిత్రాన్ని హీరో కోరిక మేరకు దర్శకుడు సంపత్ నంది ఫుల్ కామెడీ తో నింపేస్తున్నాడు ఆ క్రమంలోఇపుడు సెకండ్ హాఫ్ లో వెన్నెల కిశోర్ , హీరో గోపీచంద్ ల మధ్య కామెడీ ఓ రేంజ్ లో తీయడం జరిగిందట.. . అయితే ఈ టైములో కామెడీ చిత్రాలు వర్కౌట్ అవుతాయా లేదా అనేది పెద్ద మీమాంస. అయితే గతంలో వరుస ప్లాప్ లతో ఉన్న గోపీచంద్ ‘లౌక్యం’ అనే చిత్రంతో హిట్ కొట్టాడు. అదీ ఆయన గారి ధీమా .