Homeజాతీయ వార్తలుTelangana Jobs Notification: తెలంగాణలో మోగిన భారీ ఉద్యోగాల మేళా

Telangana Jobs Notification: తెలంగాణలో మోగిన భారీ ఉద్యోగాల మేళా

Telangana Jobs Notification: తెలంగాణలో ఉద్యోగాల జాతర మరోసారి రానుంది. ఇప్పటికే పోలీసు కానిస్టేబుళ్ల ఎంపిక కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం మరోమారు వెయ్యి జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి సంసిద్ధమైంది. ఈనెల 19 నుంచి దరఖాస్తులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులు జూన్ 8లోపు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచిస్తోంది. ఆన్ లైన్ లోనే తమ దరఖాస్తులుచేసుకోవాలని చెబుతున్నారు. ఇక నిరుద్యోగులు తమ చేతలకు పని చెబుతున్నారు .ఎలాగైనా పోస్టు కొట్టాలనే ఉద్దేశంతో రన్నింగ్ ప్రాక్టీసు చేస్తూ పరీక్ష కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.

Telangana Jobs Notification
Telangana Jobs Notification:

పదో తరగతితో పాటు ఐటీఐలో ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఉద్యోగాలకు కనీస వయసు 18-35 మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలు, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంది. దీంతో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఫిజికల్ ఫిట్ నెస్ తో పాటు రాత పరీక్షలో కూడా మంచి పట్టు సాధించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేయడంతో అభ్యర్థుల్లో ఆశలు పెరుగుతున్నాయి.

Also Read: OTT Releases This Week: ‘ఓటీటీ’ : ఈ వారం ‘ఓటీటీ’ చిత్రాల పరిస్థితేంటి ?

ఇక ఖాళీల విషయానికి వస్తే రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, నారాయణ పేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యపేట, మెదక్, సిద్దిపేట, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఖాళీలున్నట్లు తెలిసింది. హైదరాబాద్ జిల్లాల్లో కూడా ఖాళీలున్నట్లు తెలుస్తోంది.

Telangana Jobs Notification
Telangana Jobs Notification:

ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈనెల 19 నుంచి మొదలు కానుంది. అభ్యర్థులు జులై 11 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచిస్తోంది. జులై 17న వారికి రాత పరీక్ష నిర్వహించనున్నట్లు చెబుతున్నారు. అభ్యర్థులు ఉద్యోగాలు సాధించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని పట్టుదలతో ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ తో అందరు ఉద్యోగాలు సాధించాలని సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Also Read:Anasuya Bharadwaj: అందాల ఆరబోతతో ఉష్ణోగ్రతలు పెంచేసింది

Recommended Videos:

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular