కరోనా లెక్కల్లో గోల్ మాల్

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తున్నా సర్కారు లెక్కల్లో మాత్రం గోల్ మాల్ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంద. దేశమంతా ఒకవైపు కరోనా ఆందోళన చెందుతున్నా రాష్ర్టం మాత్రం చలించడం లేదు. తెలంగాణలో కేసుల సంఖ్య కూడా తక్కువగా చూపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారనే ప్రచారం వినిపిస్తోంది. రాష్ర్ట ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ సైతం తెలంగాణలో వైరస్ అంత వ్యాప్తిలో లేదని చెప్పడం గమనార్హం. లాక్ డౌన్ పెట్టకున్నా,కర్ఫ్యూ విధించకపోయినా ఇంత భారీ సంఖ్యలో కేసులు తగ్గడం వెనుక […]

Written By: NARESH, Updated On : May 6, 2021 4:37 pm
Follow us on

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తున్నా సర్కారు లెక్కల్లో మాత్రం గోల్ మాల్ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంద. దేశమంతా ఒకవైపు కరోనా ఆందోళన చెందుతున్నా రాష్ర్టం మాత్రం చలించడం లేదు. తెలంగాణలో కేసుల సంఖ్య కూడా తక్కువగా చూపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారనే ప్రచారం వినిపిస్తోంది. రాష్ర్ట ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ సైతం తెలంగాణలో వైరస్ అంత వ్యాప్తిలో లేదని చెప్పడం గమనార్హం. లాక్ డౌన్ పెట్టకున్నా,కర్ఫ్యూ విధించకపోయినా ఇంత భారీ సంఖ్యలో కేసులు తగ్గడం వెనుక ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో వైరస్ నిరోధానికి తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని పలుమార్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా సమాధానం చెప్పలేకపోయింది. దీంతో కేసుల సంఖ్య విషయంలో కూడా ఎలాంటి చర్యలు చేపడుతున్నారో చెప్పాలని ఆదేశించినా సమాధానం కరువైంది.

దాస్తున్న లెక్కలు
తెలంగాణలో కరోనా కేసుల విషయంలో లెక్కలు దాచిపెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాజిటివ్ ల సంఖ్య పెరుగుతున్నా తక్కువ కేసులు నమోదవుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. దీంతో కేసుల సంఖ్య విషయంలో సర్కారు నిర్లిప్తంగా వ్యవహరిస్తోందని తెలుస్తోంది. కరోనా వైరస్ దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలోప్రభుత్వం తన మెప్పు కోసం తప్పుడు లెక్కలు చూపించడం వెనుక ఏ రహస్యం దాగి ఉందో తెలియడం లేదు.

పట్టించుకోని మీడియా
కరోనా కేసుల విషయంలో మీడియా సైతం పట్టించుకోవడం లేదు. ఎన్నో విషయాలు చూపించాల్సిన మీడియా కరోనా బాధితుల గురించి నిర్లక్ష్యంగా ప్రదర్శిస్తుందనే ప్రచారం జరుగుతోంది. అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ కరోనా వైరస్ వ్యాప్తిపై మీడియా ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.

వైరస్ కట్టడి అయ్యిందా?
హైదరాబాద్ లాంటి మహా నగరంలో కేసుల సంఖ్య నానాటికి పెరుగుతున్నా నమోదులో తక్కువగా చూపిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. లాక్ డౌన్ విధించకున్నా, కర్ఫ్యూ పెట్టకపోయినా కేసులు తగ్గుతున్నాయని ప్రచారం చేయడం వెనుక రాజకీయ కోణం ఏదైనా దాగుందా అని పలువురు ఆలోచిస్తున్నారు. కేసుల విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తే నిజానిజాలు తెలుస్తాయని పలువురి అభిప్రాయం. రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడికి దాపరికం కాకుండా ఎప్పటికప్పుడు కేసుల సంఖ్య నిజాయతీగా ప్రకటిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేసి వైరస్ నిర్మూలనకు పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.