https://oktelugu.com/

ఎక్స్ క్లూజివ్ : ఆ నిర్మాణ సంస్థ వల్ల ఘోరం జరుగుతుంది !

కరోనా కారణంగా కొన్ని చోట్ల జనం పిట్టల్లా రాలిపోతున్నారు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు, కరోనాని జయించడానికి వైద్యం తప్పనిసరి అయిపోయింది. కానీ ప్రస్తుతం, వైద్యం అందరికీ అందుబాటులో లేదు. ఇక సినిమా ఇండస్ట్రీకి వస్తే.. సినిమా వాళ్లకు ఆరోగ్య సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. పనిచేసే విధానం, తీవ్ర ఒత్తిడి కారణం, క్వాలిటీ లేని ప్రొడక్షన్ ఫుడ్, అన్నిటికీ మించి సరైన ఆదాయం లేకపోవడం, ఇలా అనేక కారణాల వల్ల సినిమా వాళ్ళల్లో ఎక్కువమంది, ఏదొక అనారోగ్యంతో […]

Written By: , Updated On : May 6, 2021 / 04:31 PM IST
Follow us on

 Production companyకరోనా కారణంగా కొన్ని చోట్ల జనం పిట్టల్లా రాలిపోతున్నారు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు, కరోనాని జయించడానికి వైద్యం తప్పనిసరి అయిపోయింది. కానీ ప్రస్తుతం, వైద్యం అందరికీ అందుబాటులో లేదు. ఇక సినిమా ఇండస్ట్రీకి వస్తే.. సినిమా వాళ్లకు ఆరోగ్య సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. పనిచేసే విధానం, తీవ్ర ఒత్తిడి కారణం, క్వాలిటీ లేని ప్రొడక్షన్ ఫుడ్, అన్నిటికీ మించి సరైన ఆదాయం లేకపోవడం,

ఇలా అనేక కారణాల వల్ల సినిమా వాళ్ళల్లో ఎక్కువమంది, ఏదొక అనారోగ్యంతో బాధ పడుతున్నవారే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పెద్ద నిర్మాణ సంస్థ తమ షూటింగ్ కు సంబంధించి తొంభై శాతం పనులను యధాతధంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ సంస్థ ఎక్కువుగా ఆరు టీవీ ప్రోగ్రామ్స్ ను, అలాగే ఐదారు సీరియల్స్ ను తీస్తోంది. పైగా టీవీ రంగంలో ఆ నిర్మాణ సంస్థదే అగ్రస్థానం.

అందుకే, తమ కార్యక్రమాలు ఆగిపోకూడదు అని, తీవ్ర కరోనా నేపథ్యంలో కూడా సినీ కార్మికుల చేత ఆ సంస్థ పని చేయిస్తోంది. కానీ పనిచేసే ప్రదేశంలో కరోనా నివారణ చర్యలు అసలు ఎక్కడా కనిపించట్లేదు. ఒకపక్క కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూ ఉన్నాయి. షూటింగ్స్‌ లో పాల్గొన్న నటీనటులు అంతా ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. వాళ్ళంటే రెమ్యునరేషన్ ఎక్కువ కాబట్టి తట్టుకుంటారు, మరి షూట్ లో పాల్గొన్న సినీ కార్మికులు కరోనాకి గురి అయితే ఇక వారి పరిస్థితి ఏమిటి ?

ఆ నిర్మాణ సంస్థ షూటింగ్స్ వల్ల మొత్తం పదిమంది వరకు కరోనాకి గురి అయ్యారు. వాళ్లకు కరోనా సోకిన తరువాత ఆ సంస్థ వాళ్ళను పనిలో నుండి తొలిగించింది. పైగా వారికీ కనీస వైద్యం కూడా అదించలేదు. దీంతో వాళ్ళ ఆరోగ్యం మరీ అద్వానంగా తయారైందట. కరోనా భయం అంతటా కమ్ముకున్నా, వాళ్ళు కేవలం ఆ నిర్మాణ సంస్థ కోసమే పని చేశారు. కాబట్టి ఆ నిర్మాణ సంస్థనే ఇప్పుడు వాళ్ళను ఆదుకోవాలి. లేని పక్షంలో అలాంటి నిర్మాణ సంస్థల పై ప్రభుత్వం అయినా కఠిన చర్యలు తీసుకోవాలి.