కరోనా మహమ్మరి ఎవరినీ విడిచిపెట్టడం లేదు. గీత దాటారో.. వేటువేసేందుకు రెడీ అన్నట్లు ఉంది కరోనా తీరు.. చిన్న, పెద్ద, పేద, ధనిక అనే తేడా ఏమాత్రం చూపించడం లేదు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కరోనా బారినపడి మృతిచెందిన సంఘటనలు ఉన్నాయి. పలువురు ప్రముఖులకు కరోనా సోకగా హోంక్వారంటైన్లో చికిత్స తీసుకుంటున్నాయి. ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ తీసుకునే క్రీడాకారులు సైతం కరోనా బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
మండలిపై టీడీపీ ప్రయత్నాలు ఫలిస్తాయా?
పాకిస్థాన్లో కరోనా పంజా విసురుతోంది. ఇప్పటికే పాకిస్థాన్ చెందిన ఇద్దరు క్రికెటర్లు కరోనా మహమ్మరికి బలయ్యారు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు జాఫర్ సర్ఫరాజ్, రియాజ్ షేక్ కరోనాతో మృతిచెందిన సంగతి తెల్సిందే. ఇటీవలే పాకిస్థాన్ మాజీ కెప్టెన్ అఫ్రిది కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని అఫ్రిదినే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. ఇటీవల ఆరోగ్యం బాగోలేకపోవడంతో టెస్టు చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపాడు. దీంతో అఫ్రిది హోంక్వారంటైన్లోకి వెళ్లాడు.
తాజాగా మరో ముగ్గురు పాకిస్థానీ క్రికెటర్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇంగ్లండ్ టూర్ కు వెళ్లేముందు రావల్పిండిలో ఆదివారం క్రికెటర్లకు కరోనా టెస్టులు నిర్వహించారు. వీరిలో క్రికెటర్లు హైదర్ అలీ, హరీష్ రవూఫ్, షాదాబాద్ లకు పాజిటివ్ అని తేలింది. వీరిలో కరోనా లక్షణాలు లేకున్నప్పటికీ పాజిటివ్ గా తేలడం గమనార్హం. వీరిని వెంటనే హోం క్వారంటైన్ కు తరలించినట్లు పీసీబీ తెలిపింది.
వీరితోపాటు మరికొందరు ఆటగాళ్లకు పీసీబీ కరాచీ, లాహోర్, పెషావర్లలో టెస్టులు నిర్వహించింది. వీరిలో షోయబ్ మాలిక్, వకార్ యూనిస్ ఉన్నారు. వీరి రిపోర్టులు రావాల్సి ఉంది. వీరిలో ఇంకేంతమందికి కరోనా పాజిటివ్ వస్తుందనే ఆందోళనలో పీసీబీ ఉంది. ఇప్పటికే పలువురు క్రికెటర్లు కరోనా బారినపడి చికిత్స పొందుతుండగా కొత్తగా మరో ముగ్గురికి కరోనా రావడంతో క్రికెటర్లలో ఆందోళన నెలకొంది.