Telangana govt: టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 5323 పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. తెలంగాణ సర్కార్ విద్యాశాఖలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధం కావడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. త్వరలో ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన మార్గదర్శకాలు రిలీజ్ కానున్నాయి.

మార్గదర్శకాలను ప్రకటించిన తర్వాత నియామక ప్రక్రియను మొదలుపెడతామని అధికారులు చెబుతున్నారు. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగ ఖాళీలలో 2343 ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రభుత్వ పాఠశాలలో జరగనుండగా కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో 937 పీజీ రెసిడెన్షియల్ టీచర్లు, 1435 టీచర్లు, వ్యాయామ ఉపాధ్యాయులకు సంబంధించిన ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రభుత్వ కళాశాలల కోసం 211 బోధన సిబ్బంది పోస్టులను భర్తీ చేయనుండగా ఆదర్శ పాఠశాలలకు ఒకేషనల్ కోఆర్డినేటర్లు, ఒకేషనల్ ట్రైనర్లు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ విషయంలో హర్షం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు అర్హత, అనుభవానికి తగిన వేతనం లభిస్తుంది.
నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా తెలంగాణ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాల గురించి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బోధన రంగంలో అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ జాబ్స్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.