Nayanthara And Vignesh Shivan: నయనతారతో దర్శకుడు విఘ్నేష్ శివన్ పెళ్లి.. గత కొన్ని సంవత్సరాలుగా ఈ పెళ్లి పై పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్టు ఇప్పటికే ఇద్దరూ రింగులు మార్చుకున్నారు. మేము ఎంగెజెడ్ అయ్యామని నయనతార కూడా అఫీషియల్ గా ఇప్పటికే బయటపెట్టింది. ఐతే, నిన్న నయనతార జంట తమ 6వ ‘డేటింగ్ యానివర్సరీ’ ఘనంగా జరుపుకున్నారు. విగ్నేష్ శివన్ ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

మొత్తానికి గత ఆరేళ్లుగా సక్సెస్ ఫుల్ గా డేటింగ్ ను కొనసాగిస్తున్న ఈ జంటకు అభినందనలు. విగ్నేష్ శివన్ చిన్న దర్శకుడు. అతను తీసిన ‘నేనూ రౌడీనే’ అనే సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా సమయంలో విగ్నేష్ శివన్ కి వచ్చిన కొన్ని ఆర్థిక ఇబ్బందులను అర్ధం చేసుకుని నయనతార సాయం చేసింది.
దాంతో అతగాడు ఆమె ప్రేమలో పడిపోయాడు. ఇక నయనతార కూడా ఎన్నో ప్రేమ ఘాట్లు చేసిన గాయాలను మర్చిపోలేక ఇబ్బంది పెడుతున్న రోజులు అవి. అయితే, నయనతారకు అయిన గాయాలకు విగ్నేష్ శివన్ మందులా నయన్ కి అనిపించాడు. అంతే.. సగం షూటింగ్ అయిపోయే లోపే ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. అలా మొదలైన వీరి ప్రేమాయణం ఇప్పుడు పరిణయం వరకు వెళ్తుండటం గొప్ప విషయమే.
ఏది ఏమైనా ఈ లేడీ సూపర్ స్టార్ పెళ్ళి పై ఎప్పటికప్పుడు పుకార్ల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే నయన్-విఘ్నేష్ పెళ్లి పై తాజా అప్ డేట్ తెలిసింది. ఓ చర్చిలో ఈ జంట పెళ్లి చేసుకుంటారనే టాక్ కోలీవుడ్ మీడియాలో వినిపిస్తోంది. డిసెంబర్ లో పెళ్లి ఉండే అవకాశం ఉందట. పనిలోపనిగా వెంటనే అనగా ‘జనవరి’లో హనీమూన్ కూడా ప్లాన్ చేసుకున్నారు.
ఇలా అన్నీ ప్లాన్ చేసుకునే విఘ్నేష్ చేతులతో మూడు ముళ్లు వేయించుకోవాలని నయన్ ఆరాటపడుతోంది. ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. కొత్తగా అవకాశాలు వస్తోన్నా.. నయనతార మాత్రం సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ పోతుంది.