సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. విపక్షాలు.. ప్రజల నుంచి పెద్దఎత్తున నిరసనలు రావడంతో సీఎం కేసీఆర్ ఎల్ఆర్ఎస్ పై తాజాగా వెనక్కి తగ్గారు.
Also Read: కొత్త పీసీసీ చీఫ్ కు సరికొత్త సవాళ్లు.. రెడీగా ఉన్నాయా..?
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది. దీంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్లు అయిన ప్లాట్లకు.. నిర్మాణాలకు అడ్డంకులు తొలగిపోనున్నాయి.
రిజిస్ట్రేషన్లు అయిన వాటికి తదుపరి రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చునని ప్రభుత్వం పేర్కొంది. అయితే అనుమతులు లేని.. క్రమబద్దీకరణ కానీ కొత్త ప్లాట్లకు మాత్రం రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం నిరాకరించింది.
Also Read: కేసీఆర్ ఏడేళ్ల పాలనపై ‘ఉత్తమ్’ సంచలన కామెంట్స్..!
అన్ని అనుమతులన్న.. క్రమబద్దీకరణ అయిన ప్లాట్లు.. నిర్మాణాలకు మాత్రం రిజిస్ట్రేషన్లు యథాతథంగా కొనసాగించుకోచ్చని ప్రభుత్వం స్పష్టం చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక గతంలో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజలపై అధిక భారం మోపడంతో పెద్దఎత్తున విమర్శలు వచ్చింది. ఈ వ్యతిరేకతల వల్లే ఇటీవల టీఆర్ఎస్ వరుస ఎన్నికల్లో ఓడిపోయిందనే టాక్ విన్పించింది. దీంతోనే కేసీఆర్ ఎల్ఆర్ఎస్ విషయంలో వెనుకడుగు వేసినట్లుగా కన్పిస్తోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్