చిరంజీవి క్వారంటైన్లో ఉండాల్సిందే: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు

  మెగాస్టార్ చిరంజీవిపై మరో షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన అనుమానంతో మళ్లీ పరీక్షలు చేయించుకున్నారు. రెండు మూడు సార్లు పరీక్షలు చేయించుకున్నా నెగెటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో కిట్ రిపోర్టు వల్ల తనకు పాజిటివ్ రిపోర్టు వచ్చిందని చిరంజీవి తెలిపారు. అయితే ఒకసారి పాజిటివ్ రిపోర్టు వస్తే క్వారంటైన్ లోనే ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు […]

Written By: Suresh, Updated On : November 15, 2020 12:25 pm
Follow us on

 

మెగాస్టార్ చిరంజీవిపై మరో షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన అనుమానంతో మళ్లీ పరీక్షలు చేయించుకున్నారు. రెండు మూడు సార్లు పరీక్షలు చేయించుకున్నా నెగెటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో కిట్ రిపోర్టు వల్ల తనకు పాజిటివ్ రిపోర్టు వచ్చిందని చిరంజీవి తెలిపారు. అయితే ఒకసారి పాజిటివ్ రిపోర్టు వస్తే క్వారంటైన్ లోనే ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘నటుడు చిరంజీవి తొలుత పాజిటివ్ వచ్చి, ఆపై నెగిటివ్ వచ్చినట్లు తెలసింది. అయితే ఏ కరోనా పరీక్ష వందశాతం కచ్చితత్వం రాదు. ఒకసారి పరీక్షలో పాజిటివ్ వస్తే పాజిటివ్ గానే భావించాలి. లక్షణాలు ఉన్నా లేకున్నా క్వారంటైన్ లో ఉండి స్వీయ నియంత్రణ పాటించాలి’ అని పేర్కొన్నారు. అయితే చిరంజీవి దీపావళి సందర్భంగా ప్రముక డైరెక్టర్ కె.విశ్వనాథ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు.