https://oktelugu.com/

ఎల్‌ఆర్‌ఎస్‌పై తెలంగాణ సర్కార్ మరో కీలక ప్రకటన.. 

    భూముల సవరణకు తెలంగాణ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. అక్రమంగా ఉన్న లే అవుట్లు, అస్తవ్యస్తంగా ఉన్న భూములను సరి చేసుకునేందుకు ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా అప్లికేషన్‌ పెట్టుకోవాలని సూచించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈనెల 20 వరకు గడువు పొడిగించిన ప్రభుత్వం తాజాగా మరో కీలక ప్రకటన చేసింది.    Also Read: హైదరాబాద్ హై అలర్ట్: వణికిస్తున్న వాయు‘గండం’! భూముల లే అవుట్లపై 2015 నుంచి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 13, 2020 3:04 pm
    Follow us on

     
     
    భూముల సవరణకు తెలంగాణ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. అక్రమంగా ఉన్న లే అవుట్లు, అస్తవ్యస్తంగా ఉన్న భూములను సరి చేసుకునేందుకు ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా అప్లికేషన్‌ పెట్టుకోవాలని సూచించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈనెల 20 వరకు గడువు పొడిగించిన ప్రభుత్వం తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. 
     

    Also Read: హైదరాబాద్ హై అలర్ట్: వణికిస్తున్న వాయు‘గండం’!

    భూముల లే అవుట్లపై 2015 నుంచి దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పటికీ పరిష్కారం లభించలేదు. అయితే మళ్లీ ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవాలా..? లేదా..? అన్న సందేహంపై ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారు. 2015 లో దరఖాస్తు చేసుకున్న వారు మరోసారి ఎల్‌ఆర్‌ఎస్‌కు అప్లికేషన్‌ పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని అధికారులకు సూచించామని కేసీఆర్‌ తెలిపారు. 
     
    ఇక ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పటి వరకు గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల నుంచి 11 లక్షల 57వేల దరఖాస్తులు వచ్చాయి. జీహెచ్‌ఎంసీతో సహా మున్పిపల్‌ కార్పొరేషన్లలో మరో 2 లక్షల 24వేల అప్లికేషన్లు వచ్చాయి. దీని ద్వారా ప్రభుత్వానికి 118 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పెంచినందును దరఖాస్తులు ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

    Also Read: ఎల్‌ఆర్‌ఎస్‌పై తెలంగాణ సర్కార్ మరో కీలక ప్రకటన..

    మరోవైపు కాంగ్రెస్‌ నాయకులు ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టొద్దని, తమ ప్రభుత్వం వచ్చాక ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేస్తామని అంటున్నారు. అయితే భూముల విషయం కనుక ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టకపోతే తరువాత సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఫీజు విషయంలో ప్రభుత్వం సవరణ చేసినప్పటికీ అది సామాన్యుడికి ఏమాత్రం ఉపయోగం లేదంటున్నారు.