https://oktelugu.com/

Vaccination: తెలంగాణలో వ్యాక్సిన్ తీసుకోని వారికి షాకింగ్ న్యూస్

Vaccination: తెలంగాణ నుంచి కరోనాను తరిమికొట్టడానికి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రాణాలు పోతున్నా పట్టని ప్రజలకు షాకిచ్చింది. ఎంత మాత్రం కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రజలకు ఒక హెచ్చరిక జారీ చేసింది. కరోనా టీకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ తీసుకోని వారికి రేషన్, పెన్షన్ ను నిలిపివేస్తామంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచలన ప్రకటన చేసింది. ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 26, 2021 / 12:20 PM IST
    Follow us on

    Vaccination: తెలంగాణ నుంచి కరోనాను తరిమికొట్టడానికి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రాణాలు పోతున్నా పట్టని ప్రజలకు షాకిచ్చింది. ఎంత మాత్రం కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రజలకు ఒక హెచ్చరిక జారీ చేసింది.

    vaccine telangana

    కరోనా టీకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ తీసుకోని వారికి రేషన్, పెన్షన్ ను నిలిపివేస్తామంటూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచలన ప్రకటన చేసింది. ఈ నిబంధన నవంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు.

    జనాల్లో నిర్లక్ష్యం పెరిగిపోయింది. కరోనా మొదటి వేవ్ లో ఇలానే కరోనాను లైట్ తీసుకున్నందుకు సెకండ్ వేవ్ లో జనం పిట్టల్లా రాలిపోయారు. ఇప్పుడు వ్యాక్సినేషన్ బాగా జరగడంతో థర్డ్ వేవ్ ముప్పు తగ్గింది. కొన్ని దేశాల్లో మొదలైంది కూడా.. కానీ మన దేశంలో 100 కోట్ల వ్యాక్సినేషన్ కారణంగా తీవ్రత అంతగా లేదు. అలా అని నిర్లక్ష్యం వహించడానికి లేదు. అది ఎప్పుడైనా ముసురుకోవచ్చు. అందుకే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ వేసుకొని రెండో డోస్ వేసుకోని వారు సుమారు 35 లక్షల మంది ఉన్నట్టుగా తెలంగాణ సర్కార్ తేల్చింది. ఎంత చెప్పిన తీసుకోని వీరందరికీ తాజాగా షాక్ ఇచ్చింది.

    తెలంగాణలో వ్యాక్సిన్ తీసుకోని వారికి గట్టి ఝలక్ ఇచ్చింది. ఈ నెలాఖరులోగా వ్యాక్సిన్ వేసుకోకపోతే రేషన్, పెన్షన్ కట్ అవుతుందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డీహెచ్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గలేదని.. దానిని నివారించేందుకు వ్యాక్సినేషన్ ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతం అవుతుందని ప్రభుత్వం నమ్మకంగా ఉంది. మరి జనాలు ఈ హెచ్చరికలతో బయటకు వస్తారా? వ్యాక్సిన్ వేసుకుంటారా? అన్నది వేచిచూడాలి.