Vehicle Life Tax Hike: తెలంగాణ ప్రభుత్వం వినియోగదారులకు మరో షాక్ ఇవ్వనుంది. కారు, ద్విచక్ర వాహనాలు కొనే వారికి చేతి చమురు వదలగొడుతోంది. లైఫ్ ట్యాక్స్ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. తెలంగాణలో నూతనంగా వాహనాలు కొనాలనుకునే వారికి సర్కారు భయపెడుతోంది. లైఫ్ ట్యాక్స్ పెంచుతూ నిర్ణయం తీసుకవడం సంచలనం సృష్టిస్తోంది.

ఇప్పటివరకు రెండు శ్లాబుల విధానం ఉండగా ప్రస్తుతం నాలుగుకు పెంచింది. పెంచిన చార్జీలు సోమవారం నుంచి అమలులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దీని కోసం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ద్విచక్ర వాహనాలపై రూ. 50 వేల లోపు ఉన్న వాటికి ఒక రేటు ఆపై ఉన్న వాటికి రెండు శ్లాబులు నిర్ణయించడంతో వినియోగదారులకు ఇబ్బందులు రానున్నాయని తెలుస్తోంది.
Also Read: Star Heroine: స్టార్ హీరోయిన్ ప్రేమ పాఠాలు.. కుర్రాళ్ళ ఉత్సాహం
ఇక నాలుగు చక్రాల బండికి రూ. 5 లక్షల లోపు రూ.5-10 లక్షలు, రూ. 10-20 లక్షలు, రూ. 20 లక్షల పైన ఇలా నాలుగు శ్లాబులుగా విభజించారు. నాన్ ట్రాన్స్ పోర్టు కేటగిరీలో కంపెనీలు, సంస్థలు, సొసైటీలకు చెందిన పది సీట్ల వరకు ఉండే వాహనాలకు 15 శాతం, 16 శాతం, 19 శాతం, 30 శాతం సెస్సును వేయనున్నట్లు తెలుస్తోంది. ద్విచక్రవాహనాలకు ఓ రేటు నాలుగు చక్రావ వాహనాలకు మరో రేటు ఖరారు చేసినట్లు సమాచారం.

టూ వీలర్స్ కైతే రూ. 50 వేల లోపు ఉన్న వాహనాలకు రెండేళ్లకు మించకుండా ఉంటే 8 శాతం, అనంతరం ఒక్కో ఏడాదికి ఒక శాతం పన్ను తగ్గుతుంది. రెండేళ్లు దాటితే 7 శాతం, మూడేళ్లు దాటితే 6 శాతం తగ్గుతుంది. రూ. 50 వేలు పైన ఉంటే రెండేళ్లు దాటకుంటే 11 శాతం, ఒక్కో ఏడాది పెరిగే కొద్దీ ఒక శాతం తగ్గుతుంది. ఇక ఫోర్ వీలర్లకు రూ. 5 లక్షల లోపు ధర ఉంటే 13 శాతం, రూ. 10-20 లక్షల మధ్య ఉంటే 16 శాతం, రూ. 20 లక్షల పైన ఉంటే 17 శాతం చెల్లించాలి.
Also Read:AP Debt Burden: ఏపీ ప్రభుత్వ అప్పులపై క్లారిటీ.. కేంద్రం కన్నెర్ర