మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం

తెలంగాణలోని మత్స్యకారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో షరతులతో కూడిన చేపలవేటకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా రాష్ట్రంలో మే7 వరకు లాక్డౌన్ పొడగించిన సంగతి తెల్సిందే. కేవలం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతోపాటు పరిమిత రంగాలకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాజాగా ప్రభుత్వం చెరువుల్లో చేపల వేటకు అనుమతించడంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని మూడు లక్షల మంది మత్స్యకారులకు తిరిగి ఉపాధి […]

Written By: Neelambaram, Updated On : April 27, 2020 3:39 pm
Follow us on


తెలంగాణలోని మత్స్యకారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో షరతులతో కూడిన చేపలవేటకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా రాష్ట్రంలో మే7 వరకు లాక్డౌన్ పొడగించిన సంగతి తెల్సిందే. కేవలం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతోపాటు పరిమిత రంగాలకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాజాగా ప్రభుత్వం చెరువుల్లో చేపల వేటకు అనుమతించడంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని మూడు లక్షల మంది మత్స్యకారులకు తిరిగి ఉపాధి లభించనుంది.

చెరువుల్లో చేపలు వెళ్లే మత్స్యకారులు మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. మత్య్సకారులు కరోనా బారినపడకుండా మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించింది. లాక్డౌన్ కారణంగా అన్నిరంగాలతోపాటు మత్స్య పరిశ్రమ ఇప్పటివరకు చాలా నష్టపోయింది. లాక్డౌన్ కు ముందు రాష్ట్రంలో 3లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి సామర్థ్యం ఉండేది. లాక్డౌన్ వల్ల చేపల ఉత్పత్తి భారీగా తగ్గి కొరత ఏర్పడింది. ప్రభుత్వం తాజా నిర్ణయం వల్ల మత్స్యకారులు తిరిగి వ్యాపారాలను నిర్వహించి లాభాలను పొందే అవకాశం ఉంది.

లాక్డౌన్ కాలంలో ప్రజలు రోగనిరోధక శక్తి పెంచే పండ్లు, ఆహారాన్ని తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో చేపలకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ నెలకొంది. చేపల్లో రోగనిరోధక శక్తి పెంచే విటమిన్లు పుష్కలంగా ఉండటంతో ప్రస్తుతం వీటి ధర కూడా పెరిగి అవకాశం లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మార్కెట్లో ఇప్పటికే చికెన్, కోడిగుడ్డు, మటన్ ధరలకు రెక్కలు వచ్చాయి. రానున్న రోజుల్లో చేపల ధరలు కూడా ఆకాశాన్నంటున్నాయి. ప్రభుత్వం ఓ వైపు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నా కొందరు వ్యాపారులు ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వీటిపై దృష్టిసారించి ధరలు పెరగకుండా చూడాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.