స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను రద్దు చేయండి

దౌర్జన్యాలతో రాష్ట్రంలోని చాలా చోట్ల ఎం.పి.టి.సి, జడ్.పి.టి.సి స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం చేయించుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. కడప, ఇతర జిల్లాలో ఏకగ్రీవలు జరిగిన తీరును ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌కు రాసిన లేఖలో వివరించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి వైసీపీ దాడులు, దౌర్జన్యాలతో పాల్పడిందని ఆరోపించారు. స్ధానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ లలో జరిగిన అనేక అవకతవకల వలన ఇప్పుటివరకూ జరిగిన నామినేషన్ […]

Written By: Neelambaram, Updated On : April 27, 2020 2:55 pm
Follow us on


దౌర్జన్యాలతో రాష్ట్రంలోని చాలా చోట్ల ఎం.పి.టి.సి, జడ్.పి.టి.సి స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం చేయించుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. కడప, ఇతర జిల్లాలో ఏకగ్రీవలు జరిగిన తీరును ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌కు రాసిన లేఖలో వివరించారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి వైసీపీ దాడులు, దౌర్జన్యాలతో పాల్పడిందని ఆరోపించారు.

స్ధానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ లలో జరిగిన అనేక అవకతవకల వలన ఇప్పుటివరకూ జరిగిన నామినేషన్ ప్రక్రియను రద్దు చెయ్యాలని కోరారు. ఇందుకు పలు ప్రాంతాల్లో అధికారులు, పోలీసులు కూడా సహకరించారని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో తాను ఇలాంటి దౌర్జన్యకాండ ఎన్నడూ చూడలేదన్నారు. స్థానిక ఎన్నికల ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి నిర్వహించి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన కోరారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక వైసీపీ రాష్ట్రంలో వ్యవహరించిన తీరు అభ్యంతరకరమని లేఖలో పేర్కొన్నారు. ఏపీలో కరోనా విజృంభణ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. గవర్నర్ కు రాసిన మరో లేఖలో విశాఖపట్నం నగరంలో తాజాగా జరిగిన భూ కబ్జాపై విచారణ జరిపించాలని కోరారు.