Schools Reopen: వెనక్కి తగ్గని తెలంగాణ సర్కార్.. రేపటి నుంచి స్కూల్స్ ప్రారంభం

Schools Reopen: తెలంగాణలో స్కూల్స్ ప్రారంభంపై వెనక్కి తగ్గకూడదని తెలంగాణ సర్కార్ పట్టుదలగా ఉంది. హైకోర్టులో ఈరోజు తెలంగాణ స్కూల్స్ ప్రారంభించకూడదని.. కరోనా తగ్గకపోవడంతో ఇప్పుడే వద్దంటూ కొందరు పిటీషన్లు వేశారు. ఆ పిటీషన్లపై విచారించిన హైకోర్టు.. విద్యార్థులు, విద్యాసంస్థలను ప్రత్యక్ష బోధనకు రావాలని ఒత్తిడి తేవొద్దని.. ఆన్ లైన్ క్లాసులు కొనసాగించాలని సూచించింది. అయితే గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు మాత్రం తెరవవద్దని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే డే స్కాలర్ స్కూల్స్ ను తెరిచేందుకు తెలంగాణ […]

Written By: NARESH, Updated On : August 31, 2021 6:10 pm
Follow us on

Schools Reopen: తెలంగాణలో స్కూల్స్ ప్రారంభంపై వెనక్కి తగ్గకూడదని తెలంగాణ సర్కార్ పట్టుదలగా ఉంది. హైకోర్టులో ఈరోజు తెలంగాణ స్కూల్స్ ప్రారంభించకూడదని.. కరోనా తగ్గకపోవడంతో ఇప్పుడే వద్దంటూ కొందరు పిటీషన్లు వేశారు. ఆ పిటీషన్లపై విచారించిన హైకోర్టు.. విద్యార్థులు, విద్యాసంస్థలను ప్రత్యక్ష బోధనకు రావాలని ఒత్తిడి తేవొద్దని.. ఆన్ లైన్ క్లాసులు కొనసాగించాలని సూచించింది. అయితే గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు మాత్రం తెరవవద్దని స్పష్టం చేసింది.

ఈ క్రమంలోనే డే స్కాలర్ స్కూల్స్ ను తెరిచేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. రేపటి నుంచి తెలంగాణలో స్కూల్స్ పున: ప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. రెసిడెన్షియల్ మినహా మిగతా అన్ని పాఠశాలలను తెరవాలని ఆదేశాలిచ్చింది.

దీంతో తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి స్కూల్స్ పున: ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్క రెసిడెన్షియల్ మినహా మిగతా అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకు సర్కార్ అనుమతించింది. అలాగే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆఫ్ లైన్ తోపాటు ఆన్ లైన్ క్లాసులు కొనసాగనున్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు మార్పులతో కూడిన జీవోను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది.

ఇక కరోనా మార్గదర్శకాలు.. స్కూల్స్ తెరవడంపై వారంలోగా విడుదల చేస్తామని తెలిపింది. ప్రత్యక్ష బోధనపై విద్యార్థులను బలవంతం చేయమని ప్రభుత్వం తెలిపింది. ఆసక్తిగల వారే ప్రత్యక్ష బోధనకు హాజరు కావాలని తెలిపింది.

వారంలోగా అన్ని పాఠశాలలు ప్రత్యక్ష తరగతులను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. హైకోర్టు తీర్పు ప్రకారం రెసిడెన్షియల్, సంక్షేమ హాస్టల్స్ మాత్రం మూసివేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.