Huzurabad Bypoll: హుజురాబాద్ (Huzurabad) లో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీ టీఆర్ఎస్ (TRS), బీజేపీలు(BJP) అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. హుజురాబాద్ నియోజకవర్గం కేంద్రంగా పార్టీలు ప్రధాన దృష్టి కేంద్రీకరించాయి. ప్రస్తుతం తెలంగాణ ఫోకస్ అంతా హుజురాబాద్ పైనే కేంద్రీకృతమై ఉంది. హుజురాబాద్ లో పార్టీలన్ని తమ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. బీజేపీ కీలక నేతలను రంగంలోకి దింపి ప్రచారాన్ని కొనసాగిస్తోంది. టీఆర్ఎస్ కూడా అంతే స్థాయిలో తన ప్రభావాన్ని చూపించుకునే క్రమంలో దూసుకుపోతోంది.
ప్రస్తుతం హుజురాబాద్ లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈటల రాజేందర్ ను ఢీకొనే క్రమంలో తమ పార్టీ విజయం సాధించాలనే ఉద్దేశంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ అక్కడే ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తమ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈటల రాజేందర్ కూడా తన గెలుపుతో జెండా ఎగురవేయాలని భావిస్తూ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడిపోయారు.
హుజురాబాద్ ఉప ఎన్నికను తమకు అనుకూలంగా మార్చుకునేందుకే పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వస్తే అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తున్నాయి. దేశం మొత్తం హుజురాబాద్ ఉప ఎన్నిక పైనే దృష్టి సారిస్తోంది. ఇక్కడ ఫలితం ఏ విధంగా వస్తుందో అనే అనుమానాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి. ఈటల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో రాజకీయ పార్టీల చూపు నియోజకవర్గంపైనే కేంద్రీకరిస్తున్నాయి.
ఎన్నికల కమిషన్ త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తుందని భావిస్తున్న తరుణంలో పార్టీల చూపు అంతా విజయం మీదే పడింది. ఉప ఎన్నికపై నోటిఫికేషన్ విడుదల చేయాలని పార్టీలు కోరుతున్న క్రమంలో ఎన్నికల సంఘం ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చేస్తుందోనని ఎదురు చూస్తున్నారు. రాష్ర్టవ్యాప్తంగా ఈ ఉప ఎన్నికపై ఆసక్తి నెలకొంది. హుజురాబాద్ కేంద్రంగా కొనసాగుతున్న రాజకీయ రగడ సాగుతోంది.