Jobs: ఎట్టకేలకు నిరుద్యోగుల ఆకలితీర్చాడు సీఎం కేసీఆర్. ఉద్యమకాలం 2009 నుంచి ఉద్యోగాలు లేక ఉద్యమం చేసిన తెలంగాణ యువకులకు దాదాపు పదేళ్లు దాటాక ప్రభుత్వ ఉద్యోగాల భాగ్యం కలిగింది. ఉద్యమ ప్రవాహంలో స్వరాష్ట్రం సాధించిన తెలంగాణ యువతకు.. కేసీార్ గద్దెనెక్కాక కూడా గత ఏడేళ్లుగా ఉద్యోగ నియామకాలు లేక కేసీఆర్ పై కారాలు మిరియాలు నూరారు. ఎట్టకేలకు ఇప్పటికీ ఈ ఉద్యోగాల భర్తీ మొదలైంది.
ఇటీవల అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించగానే తెల్లవారే ఉద్యోగ నియామకాలు చేస్తారని అందరూ భావించారు. కానీ ప్రకటించి 10 రోజులైనా నోటిఫికేషన్లు రాలేదు. తాజాగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి కేసీఆర్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. తొలి విడతగా 30453 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించింది. ఈ ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: Sarkaru Vaari Paata: సర్కారువారి పాటను వెంటాడుతున్న ఆ బ్యాడ్ సెంటిమెంట్.. మహేష్ బ్రేక్ చేస్తాడా..?
-నియామకాలు చేసేవి ఈ ఉద్యోగాలే..
-గ్రూప్ 1లో 503 పోస్టుల భర్తీని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపట్టనుంది.
-పోలీస్ నియామక సంస్థ ద్వారా జైళ్లశాఖలో 154 పోస్టులు, పోలీస్ శాఖలో 16587 పోస్టులు భర్తీ
-టీఎస్పీఎస్సీ ద్వారా జైళ్ల శాఖలో 31 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు..వైద్య ఆరోగ్యశాఖలో 2662 పోస్టులు, డీప్యూటీ కలెక్టర్ 42, డీఎస్పీలు 91, ఎంపీడీవో 121, వైద్యఆరోగ్యశాఖ పాలనాధికారి 20, వాణిజ్య పన్నుల శాఖలో 48, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ 38, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్-40 పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. టెట్ పరీక్ష నిర్వహించనున్నారు.
Also Read: Marri Shashidar Reddy: బోయగూడా దుర్ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. మంత్రి తమ్ముడిపై సంచలన ఆరోపణలు