Telangana Elections 2023: ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల మూడ్ అనేది మొదలైంది.ఇక ఈ నెల 30వ తేదీన ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో తెలంగాణలో జనాలు ఏ పార్టీకి ఓటు వేసినా కూడా వేరే ప్రాంతాల నుంచి వచ్చి తెలంగాణలో సెటిల్ అయిన వాళ్ళు మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తున్నారని చాలా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా అసలు అందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా అనే విధంగా వార్తలైతే వస్తున్నాయి. అందరూ సెటిలర్స్ కాంగ్రెస్ వైపు గనక వెళ్ళగలిగితే బిఆర్ఎస్ పార్టీ కి భారీ దెబ్బ పడుతుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా బిఆర్ఎస్ పార్టీ వైపు తిప్పుకోవడానికి ఆ పార్టీ కీలక నేతలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
ముఖ్యంగా హైదరాబాదు లో ఉన్న వాళ్లలో ఎక్కువ మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావడం విశేషం… వాళ్లందర్నీ కూడా తమ వైపు ఎలా తిప్పుకోవాలనే విధంగా బిఆర్ఎస్ పార్టీ చాలా రకాల ప్రయత్నాలు అయితే చేస్తుంది
ఇక ఇప్పుడు అనే కాదు 2019 వ సంవత్సరంలో కూడా మహా కూటమి అనే పేరుతో ఒక కూటమి ఏర్పడి టిఆర్ఎస్ పార్టీకి అప్పట్లో చుక్కలు చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఇలా చేస్తున్నాడు అనే వార్తలు అప్పట్లో చాలా వచ్చాయి. అందుకే కెసిఆర్ కూడా చంద్రబాబు నాయుడు కి నేను నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని గెలిచిన తర్వాత కేసీఆర్ ఓపెన్ గా చెప్పడం జరిగింది…
ఇక ఇలాంటి క్రమంలోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు గాని, సినిమా ఇండస్ట్రీ లో సెటిలైపోయిన వాళ్ళందరూ హైదరాబాద్ లోనే ఉన్నారు కాబట్టి వీళ్లంతా ఎవరి వైపు వెళ్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా వాళ్లకు ఏ ప్రభుత్వం వచ్చినా పర్లేదు కానీ వాళ్లు ఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి అనే విధంగానే వాళ్ల చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ తరుపు నుంచి ఒక పెద్దాయన సినీ పెద్దలందరితో కలిసి ఒక మీటింగ్ కూడా అరెంజ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది.
ఇక అందులో భాగంగానే వాళ్లందర్నీ తన వైపు తిప్పుకొని బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరినట్టుగా కూడా తెలుస్తుంది… అయితే ఇంకా వాళ్ళు ఎటు సైడు వాళ్ళ పూర్తి మద్దతు ఇస్తున్నారు అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికీ బిఆర్ఎస్ పార్టీ మాత్రం చొరవ తీసుకొని వాళ్లతో మీటింగ్ లను కండక్ట్ చేస్తుంది. ఇక ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి.ఇక ఈ సినిమా ఇండస్ట్రీ రాజకీయంతో కలిసి ముందుకు వెళ్తుందా లేదా అనే దాని మీదనే ఇప్పుడు ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి…