India vs New Zealand Semi Final: వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా న్యూజిలాండ్ టీమ్ లా మధ్య ఈరోజు మొదటి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్ లో రెండు జట్లూ కూడా విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక ఈ భీకర పోరు లో విజేతలు గా నిలిచే టీమ్ ఏది అనేదానికోసం ప్రపంచం మొత్తం వేయి కన్నులతో ఎదురు చూస్తుంది.ఇక ఈ మ్యాచ్ లో గెలిచి సెమీ ఫైనల్ కి చేరుకోవాలని రెండు జట్లు కూడా మంచి కసి తో ఉన్నాయి.ఇక ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ లో కూడా గెలిచి కప్పు అందుకోవడమే లక్ష్యం గా రెండు టీమ్ లు బరిలోకి దిగుతున్నాయి.
ఇక ఇలాంటి క్రమంలో ఒక్కో టీమ్ ఒక్కో స్ట్రాటజీతో ఫీల్డ్ లోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియం లో జరుగుతుండడం వల్ల ఈ పిచ్ ఎక్కువగా బ్యాటింగ్ కి అనుకూలిస్తుంది.కాబట్టి ఇక్కడ ఎక్కువ పరుగులు చేయడానికి అవకాశం ఉంటుందని అందరూ అనుకుంటున్నారు కానీ ఈ సెమీఫైనల్ మ్యాచ్ కోసం ఈ పిచ్ ని స్లో పిచ్ గా తయారు చేస్తున్నారు. ఇండియన్ టీం మేనేజ్ మెంట్ సూచనలతో బీసీసీఐ క్యురేటర్లు పిచ్ పైనున్న గడ్డిని తొలగించి ప్రస్తుతం ఈ పిచ్ ని స్లో పిచ్ గా మారుస్తున్నారు.
ఇక స్వతహాగా ఈ పిచ్ స్పిన్ కి అనుకూలిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూస్తే స్లో పిచ్ గా మార్చడం వల్ల స్పిన్నర్లు ఇంకా విపరీతంగా రెచ్చిపోయి బౌలింగ్ చేస్తూ వాళ్ల సత్తా చూపించే అవకాశం అయితే ఉంది. ఇక ఈ వరల్డ్ కప్ లో ప్రతి మ్యాచ్ లో పేసర్లు స్పిన్నర్లని డామినేట్ చేస్తూ అత్యధిక వికెట్లు తీస్తూ వాళ్లే అత్యంత ప్రభావమైన ఆట తీరును కనబరుస్తున్నారు కానీ ఈ పిచ్ లో మాత్రం స్పిన్నర్లదే హవా నడవబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మన ఇండియన్ స్పిన్నర్ లో అయిన కుల్దీప్ యాదవ్,రవీంద్ర జడేజా లు ఈ మ్యాచ్ లో రెచ్చిపోయి వికెట్లు తీసే అవకాశం అయితే ఉంది.
కాబట్టి ఇలాంటి క్రమంలోనే ఇండియన్ టీం లోకి ఎక్స్ ట్రా స్పిన్నర్ గా రవిచంద్రన్ అశ్విన్ ని తీసుకుంటారా అనే విషయాన్ని కూడా ఇక్కడ పరిశీలినలోకి తీసుకోవాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలిస్తుండటం వల్ల అశ్విన్ టీంలో ఉంటే టీమ్ కి మరింత బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అతను టీం లోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి… ఇక ఈ మ్యాచ్ లో ఎవరు ముందుగా టాస్ గెలిస్తే ఆ టీం బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది…