Telangana Elections 2023: ప్రతి మనిషి ఏకాంతంగా చేసుకునే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిల్లో ఎవరైనా తలదూర్చితే చికాకు కలుగుతుంది. కోపం నశళానికి అంటుతుంది. ఆ ఆగ్రహానికి కారణమైన వారికి ఒక్కటివ్వాలనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి పనినే భారత రాష్ట్ర సమితి నాయకులు చేశారు. అదేంటి భారత రాష్ట్ర సమితి నాయకులకు మరేం పని లేదా? ఎంత రాజకీయ పార్టీ అయితే మాత్రం, తెలంగాణలో అధికారంలో ఉంటే మాత్రం ఒక వ్యక్తి వ్యక్తిగత పనుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? అనే ప్రశ్న మీకు ఉత్పన్నమవుతోంది కదూ.. అయితే ఈ కథనం చదవండి. మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది.
బాబోయ్ ఇదేం తీరు?
తెలంగాణలో ఇప్పుడు ఎన్నికల వాతావరణం పీక్ స్టేజీలోకి వెళ్ళింది. అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శల మీద విమర్శలు చేసుకుంటున్నారు. ఒకరి పాలన తీరును మరొకరు ఎండగడుతున్నారు. మీడియా, సోషల్ మీడియాలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా జరుగుతుండగానే అధికార పార్టీ నాయకులు ఒక అడుగు ముందుకేసి ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. సాధారణంగా ఎన్నికలంటే ప్రచారం షరా మామూలే.. కానీ అందరిలాగా ప్రచారం చేస్తే ఏముంటుంది అనుకున్నారేమో తెలియదు గాని భారత రాష్ట్ర సమితి నాయకులు రొటీన్ కు భిన్నంగా క్యాంపెయిన్ సాగిస్తున్నారు.. వారు సాగిస్తున్న ప్రచారం తాలూకూ వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఈ వీడియోలు చూసిన సామాన్య జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
స్నానం కూడా చేసుకోనివ్వరా?
సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియోలో గులాబీ పార్టీ నాయకులు చేస్తున్న అతి ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. భారత రాష్ట్ర సమితికి చెందిన కొంతమంది కార్యకర్తలు మెడలో గులాబీ కండువా వేసుకున్నారు. వారు గ్రామాల్లో ప్రచారం చేయడం మొదలుపెట్టారు. తమ ఎమ్మెల్యే తరఫున గ్రామాలలో తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. అధికారంలోకి వస్తే తమ ఎమ్మెల్యే అభ్యర్థి ఏం చేస్తాడో ఓటర్లకు వివరిస్తున్నారు. ఇదే క్రమంలో ఓటర్లకు తాయిలాలు కూడా ఇస్తున్నారు. ఇది సరిపోదు అనుకున్నారేమో ఒక అడుగు ముందుకేసి ఒక ఓటర్ స్నానం చేస్తుండగా అతని వీపు రుద్దారు. నా స్నానం నన్ను తీసుకొని ఇవ్వండి అని అతడు బతిమాలిన కూడా వదిలిపెట్టలేదు. ఒకరు సబ్బు రుద్దితే.. మరొకరు నీళ్లు పోశారు. కాగా దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. మీ ప్రచారం పాడుగానూ ఓటర్లను కనీసం స్నానం కూడా చేసుకొనివ్వరా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
View this post on Instagram