Bigg Boss 7 Telugu: ప్రతి ఒక ఛానెల్ లో కామెడీ షోలు, సీరియల్స్, గేమ్ షోలు అంటూ సాగిపోతున్నాయి. ఈ టీవీ, జెమినీ, స్టార్ మా ఛానెల్లను మాత్రమే ఎక్కువగా చూస్తుంటారు ప్రేక్షకులు. సీరియల్స్ తో సాయంత్రం నుంచి రాత్రి వరకు టీవీల ముందు నుంచి కదలకుండా ఉంటారు. సీరియల్స్ మాత్రమే కాదు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా సందడి చేయడంతో బుల్లితెరకు తిరుగులేకుండా పోయింది. ప్రతి ఛానెల్స్ లో డిఫరెంట్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు యాజమాన్యం. స్టార్ మా లో రియాల్టీ షో బిగ్ బాస్ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఇక దీని అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతకీ బిగ్ బాస్ సీజన్ 7 టీఆర్పీ రేటింగ్ ఎలా ఉందో తెలుసా?
బిగ్ బాస్ ఇప్పటికే 6 సీజన్ లను పూర్తి చేసుకుంది. అన్నింటికంటే ఆరవ సీజన్ కు తక్కువ ప్రేక్షకాదరణ వచ్చినట్టు టాక్. అంతకంటే ముందు ప్రసారమైన 5వ సీజన్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 5,6వ సీజన్ల ఫలితంగా యాజమాన్యం సీరియస్ గా ఆలోచించి ఉల్టాఫుల్టా అనే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సీజన్ ప్రేక్షకులు ఎంటర్టైన్ చేయడంలో విఫలం కాలేదు. మంచి ప్రేక్షకాధరణతో ముందుకు సాగుతుంది. అయితే అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3వరకు బార్క్ వెబ్ సైట్ తెలుగు టాప్ టెన్ ప్రోగ్రామ్స్ టీఆర్పీ రేటింగ్స్ ను విడుదల చేసింది. అందులో బిగ్ బాస్ తో పాటు స్టార్ మా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 వీకెండ్ 6.9 టీఆర్పీని అందుకుంది. వీక్ డేస్ లో 4.91గా నమోదైంది. ఇక సీజన్ 6 లో ఈ రేటింగ్ కేవలం వీకెండ్ లో 3, వీక్ డేస్ లో 2గా మాత్రమే పొందగలిగింది. గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ రేటింగ్ ఎంతో పెరిగిందని తెలుస్తోంది. దీనికి ఉల్టాపుల్టా అనే కాన్సెప్ట్ కలిసి వచ్చిందని అర్థం అవుతుంది. ఈ బిగ్ బాస్ తో పాటు శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్న స్టార్ మా పరివారం కూడా అద్భుతమైన ఆదరణ సంపాదించింది. ఇలా స్టార్ మాలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమాల తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఢీ షోలు ఐదు స్థానాలలో నిలిచాయి. కానీ మొత్తం మీద అన్నింటికంటే ముందు ప్లేస్ లో మాత్రం బిగ్ బాస్ సీజన్ 7 స్థానం సంపాదించింది.