Telangana Corona Cases: ఏపీలో జెట్ స్పీడుతో కేసులు పెరుగుతుంటే తెలంగాణలో తక్కువగానే నమోదయ్యాయి. కానీ ఇప్పుడు టెస్టుల సంఖ్య పెంచడంతో కేసులు బయటపడుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో తెలంగాణలో 88867 టెస్టులు నిర్వహించగా.. 3801 పాజిటివ్ కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. క్రమంగా తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలోనూ కరోనా కల్లోలం చోటుచేసుకుంటోంది. ఇక కోవిడ్ బాధితుల్లో 2046 మంది కోలుకోగా.. ఒకరు మృతి చెందారు.
తాజా కేసులతో తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 38023కి పెరిగింది. మరోవైపు జీహెచ్ఎంసీలో భారీగా కోవిడ్ కేసులు వెలుగుచూశాయి. బుధవారం ఒక్కరోజే 1570 కేసులు బయటపడ్డాయి. అలాగే రంగారెడ్డి జిల్లాలో 284 మందికి వైరస్ సోకింది. మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలో 254, హన్మకొండ 147, ఖమ్మం 137 కేసులతో తెలంగాణలో అత్యధికంగా కొత్త కేసులు వెలుగుచూసిన జిల్లాలుగా ఉన్నాయి.
తెలంగాణలో ఇప్పటివరకూ 7,47,155 మందికి పాజిటివ్ గా తేలింది. వీరిలో 7,05,054మంది కోలుకున్నారు. 4078మంది మృతి చెందారు.తెలంగాణలో ప్రస్తుతం 38వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మరోవైపు నిన్నటితో పోలిస్తే టెస్టులు, కేసులు తగ్గాయి. నిన్న 1.13 లక్షల శాంపిల్స్ టెస్ట్ చేస్తే 4559 మందికి పాజిటివ్ గా తేలిన విషయం తెలిసిందే.
తెలంగాణలోనూ కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. అయితే పక్కనున్న ఏపీలో కేసులు ఇప్పటికే 15వేలు దాటేశాయి. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి వరకూ మరింత పతాక స్థాయికి కేసులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.