CM KCR Visits Raj Bhavan: తెలంగాణలో రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య ఏడాదిగా పెరిగిన గ్యాప్ తగ్గినట్లే కనిపిస్తోంది. తాను డిసైడ్ అయితే ఎవరిమాటా వినని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కాంప్రమైజ్ అయినట్లు తెలుస్తోంది. గతేడాది ఆగస్టులో చివరిసారిగా కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లారు. తాజాగా మరోసారి కీలక అడుగు వేశారు. ఒక్క ఎంట్రీతో పలు విమర్శలకు సమాధానం చెప్పారు. విపక్షాల విమర్శలకు అవకాశం లేకుండా చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నర్ తో సమావేశమయ్యారు. ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ చేయించే ఈ ప్రమాణ స్వీకారానికి సీఎంతోపాటుగా మంత్రులు..సీఎస్ ..డీజీపీ హాజరు కావాల్సి ఉంది.
మంత్రులతో సమేతంగా..
కొంత కాలంగా ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ అన్నట్లుగా సాగుతున్న పరిస్థితుల్లో హైరోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది. టీఆర్‌ఎస్‌తో సహా విపక్షాలు సైతం ఆసక్తిగా ఎదురు చూశాయి. ఈ సమయంలో.. సీఎం కేసీఆర్ రాజభవన్‌లోకి సడన్ ఎంట్రీ ఇచ్చి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తన వెంట మంత్రులనూ తీసుకెళ్లారు. ఈ ఎంట్రీ ద్వారా గవర్నర్ – ప్రభుత్వం మధ్య గ్యాప్ పూర్తిగా తొలగక పోయినా కేసీఆర్ వేసిన తొలి అడుగు మాత్రం టీఆర్‌ఎస్ ప్రభుత్వంపైన ఈ వ్యవహారంలో విమర్శలకు ముగింపు పలికేందుకు ఉపయోగపడనుంది.
Also Read: Mohan Babu- BJP: ప్రచారం చేసింది వైసీపీకి.. ఇప్పుడు బీజేపీ పాట పాడుతున్న మోహన్ బాబు
వివాదానికి ముగింపు పలికేందుకేనా?
గవర్నర్‌తో ప్రభుత్వ వివాదంపై ప్రతిపక్షాలు.. సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్నాయి. మరో నాలుగు రోజుల్లో హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ జాతీయ కార్యకవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు వస్తున్న ప్రధాని మోదీ రాజ్ భవన్‌లోనే బస చేయనున్నారు. గత నెలలో ప్రధాని హైదరాబాద్ వచ్చిన సమయంలోనూ సీఎం కేసీఆర్ దూరంగానే ఉన్నారు. ఈసారి పార్టీ కార్యక్రమాల కోసం ప్రధాని వస్తున్న వేళ.. సీఎం కలిసే అవకాశం లేదు. జాతీయ పార్టీ ఏర్పాటు కసరత్తులో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్.. ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ అనే వివాదానికి ముగింపు పలకాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.
న్యాయమూర్తితో గ్యాప్ మంచిది కాదని..
గవర్నర్‌తో గ్యాప్ ఉన్నా కేసీఆర్‌కు పెద్దగా నష్టం లేదు. పైగా కేంద్రంపై విమర్శలకు ఈ గ్యాప్‌ను టీఆర్‌ఎస్ మంత్రలతోపాటు నాయకులు ఉపయోగించుకున్నారు. కేసీఆర్ కూడా కేంద్రం గవర్నర్లను అడ్డం పెట్టుకుని రాష్ట్రాలపై పెత్తనం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం వేళ.. నగరంలోనే ఉంటూ హాజరు కాకుంటే విమర్శలకు అవకాశం ఏర్పుడుతుందని సీఎం కేసీఆర్ భావించారు. మరోవైపు న్యాయమూర్తులతో గ్యాప్ మంచిది కాదని.. చివరి నిమిషంలో రాజ్‌భవన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈమేరకు మంత్రులు.. అధికారులతో కలిసి రాజ్ భవన్‌కు వచ్చారు. గవర్నర్‌తో కలిసి అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు.