https://oktelugu.com/

Nithya Menen: నడవలేని స్థితిలోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ ‘హీరోయిన్’

Nithya Menen; నిత్యా మీనన్ ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ అనే వెబ్ సిరీస్‌ లో నటించింది. ఈ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే, ఈ సిరీస్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఈ వెబ్ సిరీస్‌ లో నటించిన రేవతి, నరేష్, ఆది పినిశెట్టి, రీతూ వర్మ, మాళవిక నాయర్, సుహాసిని ఇలా అందరూ ప్రమోషన్స్ కోసం వచ్చారు. కానీ.. నిత్యా మీనన్‌ ను చూసే అందరూ షాక్ అయ్యారు. అసలు ఆమెకు ఏమి జరిగింది ?, […]

Written By:
  • Shiva
  • , Updated On : June 28, 2022 / 02:28 PM IST
    Follow us on

    Nithya Menen; నిత్యా మీనన్ ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ అనే వెబ్ సిరీస్‌ లో నటించింది. ఈ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే, ఈ సిరీస్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఈ వెబ్ సిరీస్‌ లో నటించిన రేవతి, నరేష్, ఆది పినిశెట్టి, రీతూ వర్మ, మాళవిక నాయర్, సుహాసిని ఇలా అందరూ ప్రమోషన్స్ కోసం వచ్చారు. కానీ.. నిత్యా మీనన్‌ ను చూసే అందరూ షాక్ అయ్యారు.

    Nithya Menen

    అసలు ఆమెకు ఏమి జరిగింది ?, గతేడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాలో నిత్యా మీనన్ చాలా ఫిట్ గా కనిపించింది కదా. మరి ఇంతలోనే ఈ భారీ బ్యూటీకి ఏం జరిగింది ? ఎందుకు నిత్యా చేతిలో స్టిక్ పట్టుకుని నడుస్తోంది. నిత్యా మీనన్ నడవలేని స్థితిలోకి ఎలా వెళ్ళింది ? పైగా ఆమె కోసం ఇద్దరు బాడీ గార్డ్స్ కూడా ఉన్నారు. వారి సాయంతోనే నిత్యా మీనన్ స్టేజ్ పైకి వచ్చింది.

    Also Read: Ram Charan – Shankar: చరణ్ – శంకర్ పై క్రేజీ అప్ డేట్.. బజ్ ఓకే, రిజల్ట్ ఏమిటి ?

    ఈ సినిమా గురించి చెబుతూ నిత్యా మీనన్ తనకు జరిగిన ప్రమాదం గురించి కూడా చెపింది. ‘ఈ వెబ్ సిరీస్‌లో నేను ఎల్బో క్రచ్‌తో నటించాను. అయితే నిజ జీవితంలో నా పరిస్థితి ప్రస్తుతం ఇదే. రెండు రోజుల క్రితం స్టెప్స్ నుంచి స్లిప్ పడిపోయాను. ఇప్పుడు ఎల్బో క్రచ్‌తో ఇబ్బంది పడుతున్నాను’ అంటూ నిత్యా మీనన్ చెప్పుకొచ్చింది. మొత్తానికి స్టెప్స్ నుంచి స్లిప్ పడిపోయి తన ఫ్యాన్స్ కి నిత్యా బాధ పెట్టింది.

    Nithya Menen

    ఏది ఏమైనా ఈ జనరేషన్ సహజ నటీమణుల్లో నిత్యా మీనన్ కూడా ఒకరు. నిత్యా మీనన్ పై చాలా రకాల రూమర్స్ వచ్చాయి. కానీ, ఆమె వ్యక్తిత్వం చాలా మంచిది అని, ఆమెతో పని చేసిన వారు చెబుతుంటారు. కాకపోతే.. కథల విషయంలో.. పాత్రల విషయంలో ఆమె వైఖరి సరిగా ఉండదు అని టాక్ ఉంది. మొత్తానికి భీమ్లా నాయక్ తో అమ్మడు భారీ విజయాన్ని అందుకుంది.

    అన్నట్లు నిత్యా మీనన్ పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఒక న్యూస్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. ఓ మలయాళ దర్శకుడు నిత్యా మీనన్ కి ఫిదా అయిపోయాడట. అతనితో నిత్యా కూడా క్లోజ్ గా ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి నిత్యా మీనన్ ప్రేమాయణం గురించి న్యూస్ సోషల్ మీడియాలో గత కొన్ని నెలలుగా వైరల్ అవుతూనే ఉంది. మరోపక్క నిత్యా మీనన్ అభిమానులు మాత్రం ఆమెకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    Also Read:Amala Paul: మెగా హీరోల పుణ్య‌మా అని క్రేజ్ తెచ్చుకుంది.. ఇప్పుడేమో ఛాన్స్ ల కోసం ఇలా.. !

    Tags