https://oktelugu.com/

Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటి? కథేంటి?

Telangana Cabinet Meeting: తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ఢిల్లీ వేదికగా నిన్న నిరసన దీక్ష చేపట్టిన టీఆర్ఎస్ కేంద్రానికి వరిధాన్యం కొనుగోలు విషయంలో డెడ్ లైన్ విధించింది. దీనిపై కేంద్ర కూడా ఘాటుగానే స్పందించింది. ఉప్పుడు బియ్యం కొనబోమని తేల్చి చెప్పింది. ఈ మేరకు కేసీఆర్ సంతకం చేసిన విషయం కూడా తెరమీదకు తెచ్చింది. దీంతో కేసీఆర్ కేంద్రంతో ప్రత్యక్షంగా పోరాటానికి దిగనున్నారనే వాదన కూడా వస్తోంది. ఇవాళ మధ్యాహ్నం […]

Written By: Srinivas, Updated On : April 12, 2022 9:32 am
Follow us on

Telangana Cabinet Meeting: తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ఢిల్లీ వేదికగా నిన్న నిరసన దీక్ష చేపట్టిన టీఆర్ఎస్ కేంద్రానికి వరిధాన్యం కొనుగోలు విషయంలో డెడ్ లైన్ విధించింది. దీనిపై కేంద్ర కూడా ఘాటుగానే స్పందించింది. ఉప్పుడు బియ్యం కొనబోమని తేల్చి చెప్పింది. ఈ మేరకు కేసీఆర్ సంతకం చేసిన విషయం కూడా తెరమీదకు తెచ్చింది. దీంతో కేసీఆర్ కేంద్రంతో ప్రత్యక్షంగా పోరాటానికి దిగనున్నారనే వాదన కూడా వస్తోంది.

Telangana Cabinet Meeting

KCR

ఇవాళ మధ్యాహ్నం ప్రగతి భవన్ లో తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. ధాన్యం కొనుగోలు అంశమే ప్రధాన ఎజెండాగా సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉప్పుడు బియ్యం తీసుకోమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో తరువాత తీసుకునే నిర్ణయంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనుంది. నిన్న ఢిల్లీలో దీక్ష చేపట్టి కేంద్రానికి విధించిన గడువు ఈ సాయంత్రంతో తీరనుండటంతో రాష్ట్రం ప్రత్యామ్నాయాలపై చర్చించనున్నట్లు సమాచారం.

Also Read: AP New Cabinet: వైసీపీలో తప్పిన క్రమశిక్షణ.. సీఎం జగన్ లో కలవరం

మంత్రివర్గ సమావేశంలో వరిధాన్యం కొనుగోలుకు కేంద్రం సుముఖంగా లేకపోవడంతో ఏం చేయాలనే దానిపైనే మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఉప్పుడు బియ్యం కొనబోమని కేంద్రం ఇదివరకే ప్రకటించింది. దీనిపై సీఎం కేసీఆర్ సంతకం చేసిన విషయం గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని చెప్పడంతో రైతుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది.

Telangana Cabinet Meeting

KCR

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు అంశం చర్చనీయాంశంగా మారిన సందర్భంలో తెలంగాణ సర్కార్ తీసుకునే నిర్ణయంపైనే రైతుల భవితవ్యం ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం ఏం చర్యలు తీసుకుంటుందో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ఢిల్లీలో కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాంషు పాండే. హైదరాబాద్ ఎఫ్ సీఐ ప్రాంతీయ జనరల్ మేనేజర్ దీపక్ మిశ్రా మీడియా సమావేశంలో ఉప్పుడు బియ్యం కొనబోమని ప్రకటించిన సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందనే దానిపై అందరిలో ఉత్కంఠ ఏర్పడింది.

మొత్తానికి కేసీఆర్ ధాన్యం కొనుగోలు అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం ఉప్పుడు బియ్యం తీసుకోమని చెప్పడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రైతుల నుంచి నేరుగా ధాన్యాన్ని సేకరిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయోననే దానిపై ఆరా తీయనున్నట్లు సమాచారం. దీంతో తెలంగాణ సర్కారు వేసే అడుగుపైనే రైతాంగం భవిష్యత్ ఆధారపడి ఉందని చెబుతున్నారు.

Also Read:Minister Roja: రోజా సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా చేసిన నటీనటులు వీరే..

Tags