CM KCR- Cabinet Extension: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణతో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడటంతో జగన్ కు తలనొప్పులు మొదలయ్యాయి. కొందరు రోడ్లెక్కి మరి నిరసన తెలుపుతున్నారు. దీంతో జగన్ డైలమాలో పడినట్లు అయింది. అధిష్టానం బుజ్జగిస్తున్నా అసమ్మతి చల్లారడం లేదు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రంగంలోకి దిగి నేతలను దారికి తెచ్చుకోవాలని చూస్తున్నా వారు వినడం లేదు. ఫలితంగా ఏపీలో రాజకీయ పరిస్థితుల్లో చాలా మార్పులు వస్తున్నాయి. వైసీపీ నేతలు తమ దారి తాము చూసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
ఏపీలో కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ జోలికి వెళ్లేందుకు ముందుకు రావడం లేదు. జగన్ కు ఎదురైన చేదు అనుభవాల సందర్భంలో సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని మార్చేందుకు వెనుకాడుతున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గాన్ని కొనసాగించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ చేపడితే అసమ్మతి నేతల సంఖ్య పెరిగి పార్టీకి నష్టం జరుగుతుందని భావిస్తున్నారు.
Also Read: AP New Cabinet: వైసీపీలో తప్పిన క్రమశిక్షణ.. సీఎం జగన్ లో కలవరం
ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రివర్గం మార్పుకు శ్రీకారం చుట్టడం శ్రేయస్కరం కాదని తెలుస్తోంది. రాజకీయ పరిణామాల్లో తేడాలు వస్తాయన్న ఆలోచనతో కేసీఆర్ మంత్రివర్గాన్ని మార్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని చెబుతున్నారు. వచ్చే ఎన్నికలకు ఇప్పుడున్న టీంతోనే వెళ్లనున్నట్లు సమాచారం. ఎలాగూ ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం సాగుతున్న వేళ మంత్రివర్గ విస్తరణ చేపట్టే సూచనలు కనిపించడం లేదు.
ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఇంకా సమస్యలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ ఊసే ఎత్తడం లేదు. ప్రతికూల ప్రభావాలు ఉన్నందున దాని గురించి ఆలోచించడమే మానేశారు. రాబోయే ఎన్నికల్లో అసంతృప్తుల సంఖ్య పెంచుకునే బదులు ఊరుకున్నదే ఉత్తమం అనే కోవలో ఆలోచిన్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ ముందస్తు ఎన్నికలకు వెళతారనే ఊహాగానాల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ అంశం వాయిదా వేస్తున్నట్లు సమాచారం.
Also Read:Minister Roja: రోజా సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా చేసిన నటీనటులు వీరే..