https://oktelugu.com/

CM KCR To Delhi: ఢిల్లీకి కేసీఆర్.. తేల్చుకునే వస్తామని సవాల్

CM KCR To Delhi: ధాన్యం కొనుగోలులో స్పష్టత కోసం సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. కొద్ది రోజులుగా రాష్ర్టంలో చోటు చేసుకున్న పరిణామాల దృష్య్టా కేంద్రం వైఖరి ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు. దీంతో రెండు పార్టీల్లో ఆందోళన నెలకొంది. అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తప్పు మీదంటే మీదని నిందలు వేసుకుని దాడులకు తెగబడే వరకు పరిస్థితి వెళ్లడం దారుణం. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : November 21, 2021 / 11:16 AM IST
    Follow us on

    CM KCR To Delhi: ధాన్యం కొనుగోలులో స్పష్టత కోసం సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. కొద్ది రోజులుగా రాష్ర్టంలో చోటు చేసుకున్న పరిణామాల దృష్య్టా కేంద్రం వైఖరి ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు. దీంతో రెండు పార్టీల్లో ఆందోళన నెలకొంది. అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తప్పు మీదంటే మీదని నిందలు వేసుకుని దాడులకు తెగబడే వరకు పరిస్థితి వెళ్లడం దారుణం. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై ఆసక్తి ఏర్పడింది.

    Also Read: వరి పోరు.. మారుతున్న కాంగ్రెస్ తీరు

    CM KCR To Delhi

    కేంద్రం వరి కొనుగోలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో రాష్ర్ట నేతల్లో అయోమయం ఏర్పడిందని తెలుస్తోంది. దీంతోనే కేంద్రంతో విభేదాలు పెరిగిపోతున్నాయి. బియ్యం విషయంలోనే రెండు పార్టీల మధ్య వైరుధ్యాలు ఏర్పడినట్లు సమాచారం. దీంతోనే కేసీఆర్ కేంద్రం వైఖరి ఏంటో తేల్చుకోవాలనే ఢిల్లీ పర్యటనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీని కోసం పార్టీ నేతలను కూడా తీసుకెళ్లనున్నట్లు చెబుతున్నారు.

    ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ధాన్యం కొనుగోలులో స్పష్టత తీసుకురావాలని భావిస్తున్నారు. అవసరమైతే ప్రధాని మోడీని కూడా కలిసి ధాన్యం కొనుగోలులో ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకోవాలని చూస్తున్నారు. రైతులను తప్పు దారి పట్టించే అవకాశం ఏర్పడినందున ధాన్యం కొనుగోలుపై అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి గాను కేసీఆర్ పకడ్బందీ వ్యూహంతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

    మరోవైపు జలవివాదాలపై ఉన్న అపోహలను కూడా తొలగించుకునేందుకు ప్రయత్నాలు చేయనున్నట్లు తెలుస్తోంది. నీటి విషయంలో కొద్ది రోజులుగా పొరుగు రాష్ర్టంతో గొడవలు చోటుచేసుకోవడంతో రెండు ప్రాంతాల మధ్య విభేదాలు పొడచూపుతున్నాయి. దీనిపై కూడా ఓ అవగాహన ఉండాలనే విషయాన్ని కేంద్రం ముందు పెట్టనున్నట్లు చెబుతున్నారు.

    Also Read: బీజేపీ బ్యాక్ స్టెప్ వేయ‌డం ఇది ఎన్నో సారి ?

    Tags